Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ అనే విషయం తెల్సిందే. ఎంత స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ స్టార్‌డం కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత వారు సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టాల్సిందే. అంటే సెకండ్ హీరోయిన్ పాత్రలు లేదా హీరోయిన్‌కు అక్క లేదా అంటీ పాత్రలు చేయాలి. ఈ విషయం పలువురు హీరోయిన్స్ విషయంలో రుజువు అయ్యింది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ కూడా ఎక్కువ సంవత్సరాలు కొనసాగే ఛాన్స్ లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా, లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయమై స్పష్టమైన ప్రకటన చేసింది.
ఏ హీరోయిన్ అయినా కూడా 30 సంవత్సరాల వయస్సు తర్వాత పెద్దగా ఆఫర్స్‌ను దక్కించుకోవడం కష్టం. అందుకే 30 ఏళ్ల వయస్సు రాగానే సినిమాలకు తాను దూరం అవ్వాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. సినిమాల నుండి తప్పుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాను అని, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ప్రేక్షకులు ఇంకా నన్ను కోరుకుంటే రీ ఎంట్రీ ఇస్తాను అంటూ భవిష్యత్తు ప్రణాళిక చెప్పుకొచ్చింది. 30 ఏళ్ల తర్వాత అవకాశాలు లేకున్నా ఇండస్ట్రీలో కొనసాగుతూ అవకాశాల కోసం అర్థించడం మంచి పద్దతి కాదు అని ఈమె అభిప్రాయం. అందరు ఇలాగే అనుకుంటారు. కాని అంతా కూడా ఆ తర్వాత ఛాన్స్‌లో కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందరిలాగే ఈమె కూడా చేస్తుందా, మాట మీద నిలబడి 30 ఏళ్లు రాగానే సినిమాలకు బై చెప్పేస్తుందో చూడాలి.
మరిన్ని వార్తలు