హిట్లు లేకపోయినా రేటు మాత్రం తగ్గట్లా ?

Rakul Remuneration Is Not Worthy

తెలుగులో వేంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎంతోకాలం పట్టలేదు. వరుసగా అగ్రకథానాయకుల సరసన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆమె స్టార్ రేంజ్ కు వెళ్ళింది. అయితే ‘స్పైడర్’ పరాజయం ప్రభావం ఆమె కెరియర్ పై బాగానే పడింది. అక్కడి నుంచే ఆమెకి అవకాశాలు తగ్గాయి. వచ్చిన ఒకటి రెండు సినిమాలు కూడా బోల్తా కొట్టడంతో ఆమె తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తూనే, తమిళంలో స్టార్ హీరోయిన్స్ జాబితాలో ఎక్కువకాలం ఉండటానికి ట్రై చేస్తోంది. అయితే రీసెంట్ గా వచ్చిన ‘దేవ్’ కూడా పరాజయాన్నే మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తమిళంలో హిట్ కొట్టిన ‘రాచ్చసన్’ కి ఇది రీమేక్. ఈ మధ్య కాలంలో హిట్లు లేకపోయినా, పారితోషికం విషయంలో ఆమె మెట్టు దిగలేదట. ఎప్పటి మాదిరిగానే ఈ సినిమా కోసం కోటిన్నర పుచ్చుకుందని చెప్పుకుంటున్నారు. గతంలో ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి ‘జయ జానకి నాయక’ చేసింది. ఇప్పుడు ఆమెకు ఇది రెండవ సినిమా అన్నమాట.