‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’… కేతిరెడ్డికి అదిరే సలహా ఇచ్చిన వర్మ

RGV advice to kethireddy about On Lakshmi's Veeragrandham movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌ జీవిత కథతో సినిమా తీస్తాను అంటూ ప్రకటించిన కొన్నాళ్లకు వర్మ తాను కూడా అదే ప్రాజెక్ట్‌ను చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఎన్టీఆర్‌కు వీరాభిమానిని, ఆయన పరమ భక్తుడిని, ఆయనకు సంబంధించిన ఒక ముఖ్య ఘటంకు సంబంధించిన సినిమాను తీస్తాను అంటూ ప్రకటించాడు. అదే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. భారీ స్థాయిలో అంచనాలున్న ఆ సినిమాలో తెలుగు దేశం పార్టీ చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లింది, లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీఆర్‌ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటీ అనే విషయాలను దర్శకుడు చూపించే ప్రయత్నం చేయబోతున్నాడు. ఆ సినిమాలో ఖచ్చితంగా తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా సీన్స్‌ ఉంటాయని, చంద్రబాబును విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తారని అంతా భావిస్తున్నారు.

ఈ సమయంలోనే తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తాను ఎన్టీఆర్‌పై ఒక చిత్రాన్ని తీస్తాను అంటూ ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్‌ను పెళ్లి చేసుకోకముందు లక్ష్మీపార్వతి జీవితం ఏంటీ, ఆమె మొదటి భర్త వీరగంధం సుబ్బారావు జీవిత విశేషాలు ఏంటీ, అసలు మొదటి భర్తను లక్ష్మీ పార్వతి ఎందుకు వదిలేసింది అనే విషయాలతో కేతిరెడ్డి లక్ష్మీస్‌ వీరగ్రంధం అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్‌ుక్‌ను కూడా విడుదల  చేశాడు. ఫస్ట్‌లుక్‌ విడుదల సమయంలో ఆమె ఎవరో కాని వీపు చాలా బాగుంది అంటూ వర్మ కామెంట్స్‌ చేశాడు. తాజాగా మరోసారి కేతిరెడ్డి సినిమాపై వర్మ తనదైన శైలిలో స్పందించాడు.

RGV comments on Lakshmi's Veeragrandham

కేతిరెడ్డి ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో ఉన్న మహిళ వీపు భాగంలో తన ఫొటోతో పాటు మహేష్‌బాబు, కేసీఆర్‌, కేతిరెడ్డి, ఎన్టీఆర్‌ ఫొటోలను పెట్టి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. కేసీఆర్‌ కంటే ఎక్కువ చరిష్మా ఉన్న కేతిరెడ్డి ‘లక్ష్మీస్‌ వీరగ్రంధం’ చిత్రంలో లక్ష్మీపార్వతి మొదటి భర్త అయిన వీరగంధం సుబ్బారావు పాత్రను పోషించి హీరో అనిపించుకోవాలి అంటూ కామెంట్స్‌ చేశాడు. కేతిరెడ్డిని వెండి తెరపై చూస్తే మహేష్‌బాబుకు సైతం మతి పోవాల్సిందే అన్నాడు. ఇక పై నుండి ఎన్టీఆర్‌ లారీ అక్షింతలను కేతిరెడ్డిపై జల్లుతాడని వర్మ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై కేతిరెడ్డి ఎలా స్పందిస్పాడు అనేది చూడాలి.