Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత మూడు నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపుతున్న విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్‌కు యాక్టింగ్ రాదని, ఆయన కేవలం తన ఇమేజ్‌తో నెట్టుకు వస్తున్నాడని, రాజకీయాలు కూడా పవన్‌కు తెలియదు అంటూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలోనే వివాదాల వర్మ ‘అర్జున్ రెడ్డి’ సినిమా గురించి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకు వచ్చాడు. సాదారణ పవన్ ప్రస్తావన తీసుకు వస్తే పర్వాలేదు. కాని పవన్‌పై చాలా దారుణమైన కామెంట్స్ చేయడంతో పాటు పవన్‌ను తీవ్రంగా అవమానించేలా పోస్ట్ చేశాడు.
మొదటి నుండి కూడా ‘అర్జున్ రెడ్డి’పై ఆసక్తిగా ఉన్న వర్మ తాజాగా ఆ సినిమాను చూశాడు. తనకు నచ్చినా లేదా నచ్చకున్నా ఆ సినిమాల గురించి సోషల్ మీడియాలో రాసేస్తూ ఉంటాడు. అయితే ఒక్క లైన్ లేదా రెండు లైన్స్‌ల్లో వర్మ రివ్యూ ఉంటుంది. కాని ఈసారి ‘అర్జున్ రెడ్డి’ గురించి సుదీర్ఘమైన రివ్యూ రాయడం జరిగింది. ఆ రివ్యూలో విజయ్ దేవరకొండ నటనపై, సినిమాపై వర్మ అద్బుతం అంటూ ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో విజయ్ దేవరకొండ నటన పవన్ కళ్యాణ్ నటన కంటే 10 రెట్లు బాగుందని, పవన్ స్టార్‌డం కంటే విజయ్ నటన 20 రెట్లు ఎక్కువ అంటూ వ్యాఖ్యలు చేశాడు. తాను ఈ మద్య చూసిన అద్బుతమైన సహజ చిత్రం అని, ఒక్క డ్యూయట్ లేకుండా, మూడు గంటల నిడివితో సినిమాను నడిపిన తీరు బాగుందన్నాడు. తాను తెరకెక్కించిన శివ కంటే కూడా ఈ సినిమా చాలా బాగుందని వర్మ వ్యాఖ్యలు చేశాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను నెత్తిన ఎత్తుకో పర్వాలేదు, ఆ వంకతో పవన్‌ను కించపర్చేలా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ మెగా ఫ్యాన్స్ వర్మను హెచ్చరిస్తున్నారు. వర్మ ఈ హెచ్చరికలకు ఏమాత్రం జంకడు అనే విషయం వారికి తెలియంది కాదు. ముందు ముందు పవన్ గురించి వర్మ ఇంకెంతగా వ్యాఖ్యలు చేస్తాడో చూడాలి.
మరిన్ని వార్తలు: