తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్‌కు అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు, తెలుగులో చాలామంది అవకాశాలు ఇస్తాము అని చెప్పి తనను వాడుకున్నారంటూ పలువురు టాలీవుడ్ ప్రముఖులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ఉద్యమాన్ని ఒక దారికి తీసుకువస్తుందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ను బూతులు తిట్టడంతో శ్రీరెడ్డిపై అంతటా వ్యతిరేత వచ్చింది. ఈ అమ్మడిని పట్టించుకోవడం మానేశారు. దాంతో చేసేది లేక ఈ అమ్మడు తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అక్కడ పలువురిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సెన్సేషన్ అవ్వాలని చూస్తోంది. లారెన్స్ రాఘవపై కూడా శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అయినా కూడా లారెన్స్ ఈ అమ్మడికి ఒక సినిమాలో నటించే అవకాశం ఇచ్చాడు.
రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మిస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరక్కించబోతున్నట్టుగా తాజాగా మరోసారి ప్రకటించాడు. అందుకు కౌంటర్‌గా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘లక్ష్మిస్ వీరగ్రంథం’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించాడు. ఈ చిత్రంలో శ్రీరెడ్డి ఒక కీలక పాత్రలో కనిపించనుందట. అయితే అది లక్ష్మి పార్వతి పాత్రనా లేక ఇంకా ఏదైనా కీలక పాత్రనా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ చెన్నైలో ఉంటున్న కేతిరెడ్డిని శ్రీరెడ్డి తాజాగా కలిసినట్టు, ఈ సినిమా గురించి చర్చలు జరిపినట్టు సమాచారం అందుతోంది. అవకాశాలు రావడం లేదు అని పిచ్చిపిచ్చిగా ప్రవర్తించిన శ్రీరెడ్డికి ఈ రెండు అవకాశాలను ఎంతవరకు ఉపయోగించుకుంటుందో మరి.