Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి నటుడు, రచయిత అయిన పోసాని కృష్ణ మురళిపై తనదైన స్టైల్లో పంచ్‌లు వేశాడు. ఇటీవల సినీ నటులను విచారించడంలో సిట్ అధికారులు కాస్త అత్యుత్సాహంను చూపుతున్నారని, ఎక్కువ సమయం తీసుకుంటున్నారు అంటూ వర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. వర్మ పలు సార్లు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కూడా సినీ పరిశ్రమకు చెందిన వారు పెద్దగా పట్టించుకోలేదు. కాని ఈసారి మాత్రం సినీ ప్రముఖులు వర్మ వ్యాఖ్యలను కొట్టి పారేస్తూ వచ్చారు. స్వయంగా మా అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ వర్మ వ్యాఖ్యలను తప్పుబట్టడం జరిగింది. ఆ తర్వాత పోసాని కృష్ణ మురళి కూడా వర్మ వ్యాఖ్యలపై మండి పడ్డాడు.
పోసాని తనపై చేసిన విమర్శలకు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. తన ఇంగ్లీష్ పోస్ట్‌లను అర్ధం చేసుకునే స్థాయి పోసానికి లేదు అని, ఆయన వాటి అర్థం తెలుసుకోకుండానే తనపై విమర్శలు చేస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పోసాని కృష్ణ మురళి తనకు చెప్పేంత స్థాయి కలిగిన వ్యక్తి కాదు అని, తనకు అన్ని విషయాలపై అవగాహణ ఉందని, ఏ ఒక్కరు తన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ వర్మ తనదైన శైలిలో పోసానికి వార్నింగ్ ఇచ్చాడు. తాను చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంకు అర్థం అయ్యాయి, సిట్ అధికారులకు అర్థం అయ్యింది. అంతకు మించి మరెవ్వరికి అర్థం అవ్వాల్సిన పనిలేదు అంటూ పోసాని చెప్పుకొచ్చాడు.
మరిన్ని వార్తలు:
షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ మంచును విష్ణు