Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘అర్జున్ రెడ్డి’ విహెచ్ వివాదాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ మద్య అర్జున్ రెడ్డి పోస్టర్‌ను చించేసిన విహెచ్‌పై తీవ్ర స్థాయిల విమర్శలు వర్మ విమర్శలు చేశాడు. వర్మ విమర్శలకు విహెచ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మద్య యుద్ద వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో తిరగనివ్వను అంటూ వర్మను విహెచ్ బెదిరించే వరకు వెళ్లింది. తాజాగా మరోసారి వర్మ ఈ విషయమై స్పందించాడు. విహెచ్ మెల్ల మెల్లగా విషయాన్ని మర్చిపోతున్న సమయంలో మళ్లీ కదిపేందుకు వర్మ ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే వర్మ మరోసారి ఫేస్‌బుక్‌లో వింత కామెంట్స్ చేశాడు.
విహెచ్‌ను ఎద్దేవా చేసేందుకు ‘అర్జున్ రెడ్డి’ చిత్ర యూనిట్ సభ్యులకు ఒక వింత సలహను వర్మ ఇచ్చాడు. సినిమా ఆరంభం నుండి చివరి వరకు ఉన్న బోల్డ్ సన్నివేశాలు మరియు ముద్దు సీన్స్ అన్ని కట్ చేసి, విహెచ్‌కు ఒక పెన్ డ్రైవ్‌లో వేసి ఇవ్వాలని, వాటిని తాతయ్య ఒంటరిగా చూసి, అప్పుడు చిల్ అవుతాడు అంటూ వర్మ పేర్కొన్నాడు. అర్జున్ రెడ్డి సినిమాను మరోసారి చూశాను. విజయ్ దేవరకొండ నటన అద్బుతంగా ఉందని, ఇలాంటి పాత్రలనే ఆయన ఎంపిక చేసుకుని, విభిన్న నటుడిగా పేరు తెచ్చుకోవాలని వర్మ సలహా ఇచ్చాడు. హాలీవుడ్‌కు చెందిన అద్బుతమైన నటుడు లియోనార్డో డికాప్రియోకు విజయ్ దేవరకొండకు దగ్గర పోలికలు ఉన్నట్లుగా తనకు అనిపిస్తుందని, సాంప్రదాయ సినిమాలకు భిన్నంగా అర్జున్ రెడ్డి వంటి సినిమాలను విజయ్ చేయాలని వర్మ సలహా ఇచ్చాడు.
మరిన్ని వార్తలు: