Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ‘అర్జున్ రెడ్డి’ ముద్దు పోస్టర్‌పై తీవ్రంగా అసహనం వ్యక్తం చేశాడు. బస్సుపై ఉన్న ఆ పోస్టర్‌ను చించేసి మరీ చిత్ర యూనిట్ సభ్యులకు వార్నింగ్ ఇచ్చాడు. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. సినిమా విడుదలై ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. అయితే వీరిద్దరి వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. విహెచ్‌పై కాస్త ఘాటుగా వర్మ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆ వ్యాఖ్యలకు మండిపోయిన వర్మ దమ్ముంటే హైదరాబాద్‌లో అడుగు పెట్టు నీ అంతు చూస్తు అంటూ బెదిరించాడు. అందుకు వర్మ కూడా సీరియస్‌గా కౌంటర్ ఇచ్చాడు.
‘అర్జున్ రెడ్డి’ సినిమాను చూసేందుకు ప్రసాద్ ఐమాక్స్‌కు వస్తున్నాను, దమ్ముంటే నన్ను అడ్డుకో అంటూ విహెచ్‌కు కౌంటర్ ఇచ్చాడు. వర్మతో పెట్టుకోవడం వద్దనుకున్న కాంగ్రెస్ నేత మూసుకున్నాడు. ఐమాక్స్ థియేటర్ వద్ద ఏదైనా హంగామా ఉంటుందా అని అంతా భావించారు. కాని విహెచ్ మాత్రం మ్యాటర్ ఇంకా లాగవద్దని భావిస్తున్నాడని, అందుకే ఆయన వర్మ సవాల్‌ను స్వీకరించలేదని కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వర్మ హైదరాబాద్‌లోనే ఉన్నాడు. ఇంతటితో ఈ వివాదం సర్దుమనిగినట్లుగా భావించవచ్చని సినీ వర్గాల వారు భావిస్తున్నారు.
మరిన్ని వార్తలు: