రాంగోపాల్ వర్మ తెలంగాణ తెరాస నేత కెసిఆర్ పై ఆసక్తికర ట్విట్ట్ చేశాడు. వర్మ ఏ పని చేసిన తన స్టైల్ తన మార్క్ కనపడేలా చేస్తాడు. తెరాస పార్టీ తెలంగాణా 2018 ఎలక్షన్స్ లో విజయ పతాకం ఎగరవేసిన సంగతి తెలిసిందే. ఈ మద్య తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 2.౦ విడుదలై మంచి విజయంను దక్కించుకుంది. ఈ చిత్రంలో రోబో 2.ఓ పాత్ర ఎంతపేరు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ పాత్ర నేపద్యంలో రాంగోపాల్ వర్మ ట్విటర్ ఎకౌంటు ద్వారా కేటిర్ కు ఓ మెసేజ్ పంపించాడు. హే కేటిర్ మీ నాన్న రజినీకాంత్ 2.ఓ కంటే 20.ఓ రెట్లు ఎక్కువ. మహేష్ బాబు కంటే 200.ఓ రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే 2000.ఓ రెట్లు ఎక్కువ అంటూ కేటిర్ కు ట్విట్ చేశాడు.
కేటిర్ ప్రతిస్పందిస్తూ మానాన్న గురుంచి నాకు ఎప్పుడో తెలుసు రాము గారు మీకు ఈ విషయం అర్ధం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది రాము అన్నాడు దానికి ప్రతి స్పందనగా అవును నాకు ఇప్పుడే అర్ధం అవ్వుతుంది ఆ విషయం అర్ధం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది అన్నారు. మీకు మీ నాన్న కు 2.౦ బిలియన్ చీర్స్ అంటూ… నేను ఎప్పుడు చెబుతుంటాను అందరి హీరోయిన్స్ కంటే కెసిఆర్ గారు అందంగా ఉంటారని కానీ ఇప్పుడు అందరి హీరోస్ కంటే కెసిఆర్ గారు చాలా అందంగా ఉన్నారు. హిమాలయాలంత ఆకర్షనీయంగా ఉంటారు. గుజరాత్ లో అతి పెద్ద పటేల్ విగ్రహాని ఏర్పాటు చేశారు. ఇక్కడ తెలంగాణాలో కూడా 2.ఓ లా పెద్ద విగ్రహాని ఏర్పాటు చెయ్యాలన్నారు. వర్మ ఏం మాట్లాడినా, చేసిన తన స్టైల్ విభిన్నంగా ఉంటుందని మరోసారి నిరూపించాడు