Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అంతా అనుకున్నట్టే రాష్ట్రపతి ఎన్నికలు ఏకపక్షం గానే సాగాయి. కొద్దిసేపటి కిందట పూర్తి అయిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఈ విషయం స్పష్టమైంది. దాదాపు 3 .5 లక్షల విలువైన ఓట్ల మెజారిటీతో nda అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో నిలిచిన రామ్ నాధ్ కోవిద్ ఘన విజయం సాధించారు. మొత్తం ఓట్ల విలువలో కోవిద్ కి 65 . 65 శాతం, యూపీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీరా కుమార్ కి 34 .35 శాతం లభించాయి. రామ్ నాధ్ కి అనుకూలంగా 7 , 02 , 643 విలువైన ఓట్లు రాగా మీరా కుమార్ కి కేవలం 3 , 67 ,114 విలువ గల ఓట్లు వచ్చాయి. దీంతో కోవిద్ గెలుపు ఖాయమైంది. ఒకప్పుడు లోక్ సభ స్పీకర్ స్థానంలో కూర్చొని విభజన బిల్లుని పాస్ చేయించిన మీరా కుమార్ కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ఓటు కూడా పడలేదు. చేసిన తప్పు ఎప్పుడోకప్పుడు దాని పర్యవసానం రూపంలో బయటపడుతుందని ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడే అన్నారట.
మరిన్ని వార్తలు