Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘ఈరోజుల్లో’ చిత్రంతో దర్శకుడిగా తనకంటూ గుర్తింపును దక్కించుకుని ఆ తర్వాత ప్రతి సినిమాతో క్రేజ్‌ను మెల్లమెల్లగా పెట్టుకుంటూ వస్తున్న దర్శకుడు మారుతి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘శైలజ రెడ్డి అల్లుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా అను ఎమాన్యూల్‌ను హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగింది. ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన అత్త పాత్రలో ఎవరు నటిస్తున్నారా అని గత కొన్నాళ్లుగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది. బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించి సూపర్ అనిపించుకున్న రమ్యకృష్ణ ఈ చిత్రంలో శైలజ రెడ్డిగా కనిపించబోతుంది. పొగరుబోతు అత్తగా రమ్యకృష్ణ కనిపించబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
రమ్యకృష్ణ హీరోయిన్గా ఎన్నో చిత్రాల్లో చేసింది. గ్లామర్ పాత్రలు పోషించిన ఈమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ వస్తుంది. తాజాగా రమ్యకృష్ణ చేసిన తెలుగు మరియు తమిళ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఆమె పాత్రలకు కూడా మంచి పేరు వచ్చింది. అందుకే ఈ సినిమాలో ఆమెను అత్త పాత్రకు ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. పొగరుబోతు అత్తగా ఖచ్చితంగా రమ్యకృష్ణ ఆకట్టుకుంటుందనే నమ్మకంను మారుతి పెట్టుకున్నాడు. అందుకే ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. షూటింగ్ ప్రారంభించి చాలా వారాలు గడుస్తుంది. అయినా కూడా ఇప్పటి వరకు రమ్యకృష్ణకు సంబంధించిన సీన్స్‌ను చిత్రీకరించలేదు. ఇప్పుడు చైతూ, అను ఎమాన్యూల్లతో పాటు రమ్యకృష్ణలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయాలని మారుతి ప్లాన్ చేస్తున్నాడు.