ఏమాత్రం తగ్గని రంగస్థలం జోరు

rangasthalam movie collections updates

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ రెండవ వారంలో కూడా దూకుడు కొనసాగిస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందిన రంగస్థలం అంచనాలకు తగ్గట్లుగా ఉంది. మొదటి వారంలో ఏకంగా 81 కోట్ల షేర్‌ను దక్కించుకున్న రంగస్థలం రెండవ వారంలో కూడా దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తుంది. నితిన్‌ నటించిన ‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దాంతో రెండవ వారంలో కూడా రంగస్థలం చిత్రం మంచి వసూళ్లను రాబడుతుంది.

రెండవ వారాంతంలో ‘రంగస్థలం’ చిత్రం మరో 30 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. సమ్మర్‌ కానుకగా విడుదలైన ఈ చిత్రంకు ఐపీఎల్‌ దెబ్బ కాస్త పడే అవకాశం ఉందని, అయితే పెద్ద సినిమాలు లేకపోవడం, ఇతర చిత్రాల నుండి పోటీ లేక పోవడం వల్ల మంచి కలెక్షన్స్‌ రావడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రంగస్థలం రెండవ వారంలో కూడా భారీ వసూళ్లను రాబట్టి నాన్‌ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఓవర్సీస్‌లో కూడా దుమ్ము దుమ్ముగా ఈ చిత్రం వసూళ్లను రాబడుతుంది.