వైసీపీ ఎంపీలవి రాజీనామాలు కాదు రాజకీయ మరణ వాంగ్మూలాలు.

YSRCP MP's Resignations Speaker may accept soon

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆపరేషన్ గరుడలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ మీద ఒత్తిడి పెంచడానికి బీజేపీ వేసిన ఎత్తుల్లో ఒక్కటి వైసీపీ ఎంపీల రాజీనామాలు. ఈ రాజీనామాలని స్పీకర్ ఆమోదించబోరన్న హామీ మేరకు వైసీపీ అత్యుత్సాహంతో ముందుకు దూకిందట. అయితే తాము రాసింది రాజీనామా లేఖలు కాదని రాజకీయ మరణ వాంగ్మూలాలని ఆ నాయకులకు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోందట. మాట తప్పడం అలవాటుగా మార్చుకున్న మోడీ, అమిత్ షా ద్వయం ఇప్పుడు వైసీపీ కి ఇచ్చిన మాట కూడా తప్పే ఆలోచనలో ఉందట. తాము ఎన్ని చేసినా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గ్రాఫ్ పెరగకపోవడంతో ఆ పార్టీని పూర్తిగా తొక్కేసి ఆ స్థానంలోకి తాము రావడానికి ఆ ఇద్దరు కొత్త ప్లాన్ రెడీ చేసారంట. ఆ ప్లాన్ ఏమిటంటే…

ఆంధ్రప్రదేశ్ లో రాజుకున్న ప్రత్యేక హోదా ఉద్యమం ఆరకముందే వైసీపీ ఎంపీల రాజీనామాలని ఆమోదించడం ద్వారా ఉప ఎన్నికలకు వెళ్లడం. ఆ ఉప ఎన్నికల్లో టీడీపీ కూడా సర్వశక్తులు ఒడ్డుతుంది కాబట్టి ఎన్నోకొన్ని స్థానాల్లో గెలుస్తుంది. ఎన్నికలు జరిగేది మొత్తం వైసీపీ కి పట్టున్న స్థానాలే కాబట్టి అక్కడ కూడా ఓటమి పాలు అయితే ఆ పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. ఆ స్థానంలో కి జనసేనతో కలిసి పాగా వేయాలని బీజేపీ ప్లాన్ రెడీ చేసుకుందట. ఈ విషయం కాస్త ఆలస్యంగా గ్రహించిన వైసీపీ ఎంపీలు రాజీనామాలు అంగీకరించకుండా ఏదో ఒకటి చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి మీద ఒత్తిడి తెస్తున్నారట. ఆయన ఆ భయాలు ఏమీ అక్కర్లేదని వారికి భరోసా ఇచ్చి ఎందుకైనా మంచిదని బీజేపీ లోని తన సన్నిహితులతో క్లారిటీ అడిగారట. స్పీకర్ నిర్ణయం గురించి తామెలా చెబుతామని వచ్చిన సమాధానంతో బిక్కచచ్చిన విజయసాయి ఈ విషయాన్ని జగన్ తో ఎలా చెప్పాలో తెలియక అల్లాడిపోతున్నారట. అయినా పులి నోట్లో తల పెట్టి కోరుకుతుందేమో అని భయపడి ప్రయోజనం ఏముంటుంది ? రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలు తప్ప అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది ?