Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా ఫ్యాన్స్ సుదీర్ఘ ఎదురు చూపులకు ఫుల్స్టాప్ పడబోతుంది. మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు, సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘రంగస్థలం’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అని టీజర్ మరియు ట్రైలర్, పాటలను చూస్తుంటే అనిపిస్తుంది. పూర్తిగా పల్లెటూరు వాతవారణంలో, 1980 కాలం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈమద్య కాంలో అతి పెద్ద ప్రయోగాత్మక చిత్రం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ చెవిటి వాడిగా నటించడం అతి పెద్ద సంచలనం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
భారీ స్థాయిలో అంచనాలున్న ‘రంగస్థలం’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ఏకంగా 1750 థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సమంత ఈ చిత్రంలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. కెరీర్ ప్రారంభించి ఇన్నాళ్లు అయినా కూడా ఇప్పటి వరకు ఇలాంటి పాత్రను సమంత చేయలేదు. చాలా సహజంగా, ఒక పల్లెటూరు అమ్మాయిగా సమంత ఈ చిత్రంలో కనిపించబోతుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాటలు సినిమాను అప్పుడే సగం సక్సెస్ చేశాయి. రంగస్థలం చిత్రం షూటింగ్ కోసం ఒక భారీ పల్లెటూరు సెట్‌ను వేయడంతో పాటు, కొన్ని సీన్స్ సహజత్వంకు దగ్గర ఉండాలనే ఉద్దేశ్యంతో చాలా కష్టపడి పల్లెటూరులో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొత్తానికి ఈ చిత్రం రేపు ప్రేక్షకులను పలకరించబోతుంది. రికార్డు స్థాయి వసూళ్లను ఈ చిత్రం సాధిస్తుందో లేదో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఆల్ ది బెస్ట్ టు రంగస్థలం టీం.