ముంబైకి చెందిన మోడల్, బుల్లితెర నటి (25) ప్రియుడి చేతిలో అత్యాచారానికి గురయ్యానని తనను పెళ్లి పేరుతో నమ్మించి అత్యాచారం చేశాడంటూ రాజస్థాన్ లోని అల్వార్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరు 2014లో ముంబైలో ఆమె చదువుకుంటున్నప్పుడు నిందితుడు పరిచయమయ్యాడని, సోషల్ మీడియా ద్వారా ఇటీవల మళ్లీ తనను కలిశాడని ఇద్దరి మధ్య స్నేహం పెరిగిన తర్వాత ఆగస్టులో తామిద్దరం కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని, అతడిని కలిసేందుకు ముంబై నుంచి ఢిల్లీ వెళ్లినట్టు చెప్పింది.
తొలుత తన ఇంటికి తీసుకెళ్లిన నిందితుడు తల్లిదండ్రులు, స్నేహితులకు పరిచయం చేశాడు. అనంతరం ఇద్దరం కలిసి ఈ నెల 4న రాజస్థాన్ లోని నీమ్ రాణాకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. అక్కడకు వెళ్లాక పెళ్లి పేరు చెప్పు తనను పలుమార్లు శారీరికంగా కలుసుకున్నామని ఆమె ఫిర్యాదు చేసారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన అతను ఆ ఆ తర్వాత ముఖం చాటేశాడని దీంతో తాను మోసపోయానని గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.