దర్శకుడితో ఎఫైర్‌ లేదంటోంది

Rashi Khanna Clarifies about Love Affair with Anil Ravipudi
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా మెల్ల మెల్లగా స్టార్‌ హీరోల సరసన నటించే ఛాన్స్‌ దక్కించుకుంటుంది. ఈ అమ్మడు మొదటి సినిమాలో చాలా బొద్దుగా కనిపించింది. ఆ తర్వాత అవకాశాల కోసం చాలా బరువు తగ్గింది. తాజాగా ఈమె నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల ఈమె అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మల్టీస్టారర్‌ చిత్రంలో సెలక్ట్‌ అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను కొట్టి పారేసిన రాశిఖన్నా మరో విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది.

అనీల్‌ రావిపూడితో రాశిఖన్నా చాలా క్లోజ్‌గా ఉంటుందని, ఆయనతో ప్రేమలో ఉందంటూ పుకార్లు మొదలయ్యాయి. అనీల్‌పై ఉన్న ప్రేమతోనే ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో పైసా పారితోషికం తీసుకోకుండా ఐటెం సాంగ్‌ చేసిందంటూ వార్తలు వచ్చాయి. గత కొన్నాళ్లుగా ఈ విషయమై సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా రాశిఖన్నా ఆ విషయమై క్లారిటీ ఇచ్చింది. రవితేజ, అనీల్‌లు తనకు మంచి స్నేహితులు అని, అందుకే ఆ చిత్రంలో ఐటెం సాంగ్‌ చేశాను. అంతే తప్ప అనీల్‌తో మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చింది. అనీల్‌ రావిపూడి మల్టీస్టారర్‌ చిత్రంలో కూడా ఈమె నటించడం లేదని తేల్చి పారేసింది. ఎంతగా రాశిఖన్నా చెబుతున్నా కూడా దర్శకుడితో ఎఫైర్‌ విషయమై గుసగుసలు గుప్పుమంటున్నాయి.