కోట్లను వదులుకోలేక నిశ్చితార్థం రద్దు..!

Rashmika Mandanna Breaks Off Engagement With Rakshit Shetty

రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో టాప్‌ హీరోయిన్‌ అయ్యింది. మొదటి చిత్రం ‘ఛలో’ విజయం సాధించడంతో ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రష్మిక ‘గీత గోవిందం’ చిత్రంతో స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది. ఓవర్‌ నైట్‌ స్టార్‌కు ప్రత్యక్ష ఉదాహరణ రష్మికను చెప్పుకోవచ్చు. కేవలం గీత గోవిందం చిత్రంతో రష్మిక దశ తిరిగి పోయింది. ప్రస్తుతం ఈమెకు కోటి రూపాయలకు మించి పారితోషికం ఇచ్చి మరీ తమ సినిమాల్లో నటింపజేసేందుకు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఏ హీరోయిన్‌ కూడా పెళ్లి గురించి ఆలోచించదు. అందరిలాగే రష్మిక కూడా పెళ్లి ఇప్పుడు వద్దని నిర్ణయించుకుంది.

rashimik-aengagement-cancle

రష్మిక వివాహ నిశ్చితార్థం జరిగి చాలా రోజులు అయ్యింది. త్వరలో పెళ్లి అనుకుంటున్న సమయంలో గీత గోవిందం సక్సెస్‌ రావడం, కోట్ల పారితోషికాలతో ఆఫర్లు వరుసగా వస్తున్న నేపథ్యంలో నిశ్చితార్థంను క్యాన్సిల్‌ చేసుకుంది. కన్నడ నటుడు రక్షిత్‌తో వివాహంకు సిద్దం అయిన రష్మిక ఇప్పుడు నిశ్చితార్థంను రద్దు చేసుకున్న నేపథ్యంలో ఆమెపై సోషల్‌ మీడియాలో కన్నడ ప్రేక్షకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. సినిమాల్లో ఆఫర్లు వస్తున్న కారణంగా పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంది అంటూ రష్మికపై రక్షిత్‌ అభిమానులు నిప్పులు కక్కుతున్నారు. ఈ విషయమై స్పందించేందుకు రక్షిత్‌ మాత్రం నో అంటున్నాడు. ఇన్నాళ్లు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న రక్షిత్‌ పెళ్లి క్యాన్సిల్‌ కారణంగా సోషల్‌ మీడియా నుండి వైదొలిగినట్లుగా తెలుస్తోంది.

rashimika-wedding