Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాస్టింగ్ కౌచ్ అనే అంశం టాలీవుడ్ లో కొద్దిరోజుల క్రితం పెను సంచలనమే రేగింది. నటి శ్రీరెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పేరుతో ఇండస్ట్రీకి వచ్చే ప్రతీ ఆడదాన్ని లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపణలు చేసి పెను దుమారమే సృష్టించింది. అయితే ముందు వ్యతిరేకత వచ్చినా నెమ్మదిగా ఆమె చేపట్టిన ఉద్యమానికి నెమ్మదిగా మద్దతు వచ్చింది. అయితే ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే మగవారిపై కూడా కాస్టింగ్ కౌచ్ ప్రభావం పడుతోందని ప్రముఖ విలన్ పాత్రధారి, భోజపురి నటుడు రవి కిషన్ సంచలన ఆరోపణలు చేసారు.
నమ్మడానికి వీలుగా లేకపోయినప్పటికీ ఈ విషయం నిజమే అని ఆయన పేర్కొంటున్నాడు. కాస్టింగ్ కౌచ్ ఆడవారికే కాదు, మగవారికీ ఎదురవుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. మగవారిని లైంగికంగా వేధించే హీరోయిన్ల సంఖ్య సినీరంగంలో ఎక్కువైందని పేర్కొన్నాడు. కొందరు హీరోయిన్లు ఇక్కడ మగవారిని సైతం ఆ విధంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారాయి. కాకపోతే (రవికిషన్ కే ) ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయా లేదా మరెవరికైనా ఎదురయ్యాయా అన్నది మాత్రం తేలాల్సి వుంది.