Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేలటిక్కెట్టు’ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయింది. సోగ్గాడే చిన్ని నాయన మరియు రారండోయ్ వేడుక చూద్దాం అంటూ కమర్షియల్ సక్సెస్‌లను దక్కించుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రంతో మరో విజయాన్ని అందుకోవడం ఖాయం అంటూ అంతా భావించారు. కాని అనూహ్యంగా ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలో విఫలం అయ్యింది. రికార్డులు బ్రేక్ చేస్తుందని భావించిన నేలటిక్కెట్టు కనీసం పెట్టుబడిని వెనక్కు రాబట్టడంలో సఫలం కాలేదు. సినిమా విడుదలైన మొదటి రోజే నెగటివ్ టాక్ రావడంతో సినిమాకు మినిమం కలెక్షన్స్ రావడం లేదు.
‘నేలటిక్కెట్టు’ చిత్రం కంటే ముందు విడుదలైన ‘మహానటి’ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. రవితేజ చిత్రం సక్సెస్ కాకపోవడంతో మహానటి జోరు కొనసాగింది. మహానటి లేనట్లయితే ఫలితం కాస్త భిన్నంగా ఉండేది. కాని మహానటి చిత్రంకు అన్ని వర్గాల నుండి నీరాజనాలు అందుతున్న సమయంలో ఈ చిత్రంను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూడం లేదు. దాంతో ఎక్కువ థియేట్ల నుండి ఈ చిత్రాన్ని అప్పుడే తొలగించినట్లుగా తెలుస్తోంది. మొదటి వారంలోనే ఈ చిత్రం 90 శాతం థియేటర్ల నుండి తొలగి పోతుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మొత్తానికి ‘నేలటిక్కెట్టు’ చిత్రం రవితేజకు మరో ‘టచ్ చేసి చూడు’ చిత్రం ఫలితాన్ని ఇచ్చింది. రవితేజ కెరీర్‌లో మరో డిజాస్టర్ ఈ చిత్రం రూపంలో పడ్డట్లుగా చెప్పుకోవచ్చు.