మరోసారి కన్ఫర్మ్‌ చేసిన రవితేజ

ravi-teja-touch-chesi-chudu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]          

రెండు సంవత్సరాల విరామం తర్వాత రవితేజ ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్‌’ విడుదల కాగానే రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ సినిమాను ఫినిష్‌ చేసే పనిలో పడ్డాడు. మొదట ఈ చిత్ర దర్శకుడు విక్రమ్‌ సిరితో రవితేజకు విభేదాలు వచ్చాయని, ఇద్దరి మద్య నెలకొన్న వివాదం కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది అంటూ ప్రచారం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విబేదాలు పక్కకు పెట్టి సినిమాను పూర్తి చేసే పనిలో ఇద్దరు పడ్డట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే అందులో నిజం ఎంత ఉందనే విషయంపై క్లారిటీ రాలేదు.

మరోసారి కన్ఫర్మ్‌ చేసిన రవితేజ - Telugu Bullet

తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు మరోసారి అధికారికంగా ‘టచ్‌ చేసి చూడు’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. వచ్చే నెల 13వ తారీకున రవితేజ చిత్రం బాక్సాఫీస్‌ వద్దకు రావడం ఖాయం అయ్యింది. ఇక సంక్రాంతి బరిలో ఇప్పటికే పవన్‌ అజ్ఞాతవాసి మరియు బాలయ్య జైసింహా చిత్రాలు ఉన్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలకు తోడుగా ఈ చిత్రం కూడా పోటీలో నిలవడంతో మరింత రంజుగా సంక్రాంతి పోటీ ఉండబోతుంది.

పలు చిత్రాలకు రచన సహకారం అందించిన విక్రమ్‌ సిరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాశిఖన్నా మరియు సీరత్‌ కపూర్‌లు ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా మాస్‌ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల వారిని ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీని తట్టుకుని రవితేజ నిలుస్తాడా లేదా అనేది చూడాలి.