Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రవితేజ హీరోగా విక్రమ్ సిరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘టచ్ చేసి చూడు’ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని డిసెంబర్‌లో తెగ ప్రచారం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో పోటీ పడటం అంటే ఆత్మహత్య సదృష్యం అనే ఉద్దేశ్యంతో రవితేజ చిత్రాన్ని రిపబ్లిక్ డేకు మార్చారు. కాని సంక్రాంతి సీజన్‌లో విడుదలైన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో ఇప్పుడు రవితేజ సినిమాను విడుదల చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అజ్ఞాతవాసి సాధిస్తుందని, అలాంటి సమయంలో రవితేజ సినిమా ఆ చిత్రం కింద పడి నలిగి పోవడం ఎందుకు అంటూ కొందరు సలహా ఇవ్వగా, నిర్మాత సినిమా విడుదల వాయిదా వేశాడు.
రవితేజ పుట్టిన రోజు సందర్బంగా సినిమాను జనవరి 25వ తారీకున విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. రిపబ్లిక్ డే సందర్బంగా లెక్కకు మించి సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇలా కూడా రవితేజ సినిమాకు కష్టాలు తప్పవనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా భాగమతి చిత్రం వల్ల రవితేజ సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. రవితేజ సంక్రాంతికి వచ్చి ఉంటే మంచి కలెక్షన్స్ రాబట్టే వాడని, ఫలితం అటు ఇటుగా ఉన్నా మినిమం గ్యారెంటీ కలెక్షన్స్ వచ్చేవి అనే టాక్ వినిపిస్తుంది. సంక్రాంతి సీజన్‌ను మిస్ చేసుకున్నందుకు ఇప్పుడు రవితేజ ఫీల్ అవుతూ ఉంటాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతికి కలెక్షన్స్ గలగల లేకపోవడంతో సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు.