రాయపాటి రాజీనామా?

Rayapati Sambasiva Rao ready to Resign for MP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయం మీద నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రంగా స్పందించారు. కేంద్రం నిర్లక్ష్యానికి ప్రతిగా రాజీనామాకు సిద్ధం అని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని రాయపాటి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ హ్యాండ్ ఇవ్వడం వెనుక rss హస్తం ఉందని రాయపాటి ఆరోపించారు. యూపీఏ హయాంలో ఎంపీ లంటే కొద్దోగొప్పో విలువ ఉందని , మోడీ సర్కార్ లో ప్రజాప్రతినిధులకు కనీస మర్యాద లేదని ఆయన చెప్పారు. Rss ఏది చెబితే బీజేపీ సర్కార్ అదే చేస్తోందని ఆయన అన్నారు. ఏపీకి అన్యాయం చేసి కాంగ్రెస్ మట్టి కరిచిందని, ఇక బీజేపీ కి కూడా ప్రజలు అదే పరిస్థితి కల్పిస్తారని రాయపాటి హెచ్చరించారు.