రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎన్ ఎస్ విశ్వనాథన్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. డిప్యూటీ గవర్నర్గా విశ్వనాథన్ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన నియామకానికి కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ సోమవారం ఆమోద ముద్ర వేసింది. జులై 4 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానుంది. వచ్చే బుధవారంతో ఆయన పదవీకాలం పూర్తికానుంది. ప్రస్తుతం ఆర్బీఐలో ఉన్న ముగ్గురు డిప్యూటీ గవర్నర్లలో విశ్వనాథన్తో పాటు బీపీ కానుంగో, ఎంకే జైన్ ఉన్నారు. గత నెలలో డిప్యూటీ గవర్నర్గా విరాళ్ ఆచార్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన మూడు సంవత్సరాల పదవీకాలం ఇంకో ఆరు నెలలు ఉండగానే తన బాధ్యతల నుంచి వైదొలిగారు.