సీబీఐ విచారణ సిద్దమన్న రమణ దీక్షితులు…ఇంత కధ ఉందా ?

ready to face probe says ramana dekshitulu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఇరవై నాలుగేళ్ల పాటు వ్యవహరించిన రమణదీక్షితులు గత కొద్దిరోజులుగా టీటీడీ మీద పలు సంచలన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆయన బీజేపీ నాయకులని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముందుగా టీటీడీ మీదా చంద్రబాబు మీదా పలు ఆరోపణలు చేయడంతో తెదేపా సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి రమణ దీక్షితులు ఆస్తుల చిట్టా సేకరించి వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో కొద్దిరోజులు సైలెంట్ అయ్యి మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యమనే వంకతో అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన.. మూడురోజుల తరువాత డిశ్చార్జ్ అయిన కొన్ని గంటల్లోనే మీడియా ముందుకు వచ్చారు.

ఇన్ని రోజులుగా తాను మౌనంగా ఉండటానికి అనారోగ్యమే కారణమనే సంకేతాలు ఇస్తూ ఇప్పుడు తన ఆస్తులపై అనేక ఆరోపణలు చేస్తున్నారని వాటి మీద సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించారు. అయితే అచ్చం రాజకీయ నేతల్లాగే..తనపై సీబీఐ విచారణ జరపాల్సిందిగా కోరారు. అంతేకాదు.. తనపై ఆరోపణలు చేస్తున్నవారు కూడా సీబీఐ విచారణకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. ఆస్తులన్నీ తనకు వారసత్వంగానే సంక్రమించాయని చెప్పారు. 24 ఏళ్లుగా అవమానాలను భరిస్తూ వచ్చానని అన్నారు. వంశపారంపర్యంగా వచ్చిన ఇల్లును కూల్చి తనకు నిలువ నీడ లేకుండా చేశారని ఆరోపించారు. స్వామి వారి ఆస్తులు కాపాడాలని కోరితే తనకు రిటైర్మెంట్ ప్రకటిస్తారా? అంటూ టీటీడీ తీరుపై మండిపడ్డారు.

ఇరవై నాలుగేళ్లుగా ఆయన అధికారుల అవమానాలను భరిస్తూనే ఉన్నాని ఆయన పేర్కొనడం గమనర్హం. వేయి కాళ్ల మండపం కూల్చివేయడనికి.. ప్రధాన అర్చకుని హోదాలో… రమణదీక్షితులు అంగీకారం ఇచ్చినట్లు గతంలో పత్రాలు బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు మీడియా ముందు తాను వేయి కాళ్ల మండపాన్ని కూల్చకుండా పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా వినతి పత్రం కూడా ఇచ్చానని పేర్కొన్నారు. టీటీడీలో పని చేసి.. ఇటీవలి కాలంలో.. రమణదీక్షితులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తమ అనుభవం తో చెప్పిన ధర్మారెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసరాజులపై… రమణదీక్షితులు తీవ్రంగా మండిపడ్డారు. ధర్మారెడ్డి హయాంలోనే నాపై రెండుసార్లు హత్యాయత్నం జరిగిందని కూడా చెప్పుకొచ్చారు. బాల సుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజు.. బ్రాహ్మణ, అర్చక వ్యతిరేకులుగా, నాస్తికులుగా పనిచేశారన్నారు.

తనపై కక్ష కట్టిన అధికారులు ఎంతో ప్రాచీనమైన, వంశపారంపర్యంగా వచ్చిన తన ఇంటిని కూడా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలసుబ్రమణ్యం చట్టవ్యతిరేక విధానాలు, వ్యసనాలకు అలవాటుపడి అర్చకులను క్రూరంగా హింసించేవాడన్నారు. ఇక శ్రీనివాసరాజు అవినీతి, అక్రమాలు ప్రపంచానికి మొత్తం తెలుసని ఆరోపించారు. 24 ఏళ్లుగా ఇలాంటి అధికారులతో హింసకు గురయ్యానని చెప్పారు. గతంలో శ్రీవారి ఆభరణాలపై విచారణ జరిపిన కమిటీలకు… ప్రధాన అర్చకుని హోదాలో ఎలాంటి ఫిర్యాదులు చేయని రమణదీక్షితులు ఇప్పుడు బ్రిటిష్‌ మన్యూవల్ గురించి కూడా అవలీలగా చెప్పేస్తున్నారు. ప్రతాపరుద్రుడు ఇచ్చిన నగలు నేలమాళిగల్లో ఉన్నాయని .. ఆ నిధుల కోసం తవ్వకాలు జరిగాయని చెప్పుకొస్తున్నారు.

తనకు పది రూపాయల అక్రమాస్తులు ఉన్నాయని.. నిరూపించినా ఎలాంటి శిక్షకైనా సిద్ధమంటున్నా ఆడికారు.. ఇటీవలి కాలంలో కొనుగోలు చేసిన ఆస్తుల కు సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇంత చెప్పినా ఆయన తాను మరణించేవరకూ శ్రీవారి సేవలోనే ఉంటానని.. తనకు రిటైర్మెంట్ లేదంటున్నారు. దీని అంతటి వెనుకా బీజీపీ పెద్దలు లేనిదే ఆయన అలా సీబీఐ ఎంక్వైరీ కోరరని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే సీబీఐ ఎంక్వైరీ వేయాల్సింది కోర్టులు ప్రస్తుతం సుబ్రమణ్య స్వామి లాంటి పక్క రాష్ట్రము వారు తప్ప విషయం తెలిసిన వారు ఎవరూ కేసులు వేసే అవకాశం లేది ఒకవేళ వేసి అది సీబీఐ ఎంక్వైరీ దాకా వెళ్ళినా గాలి జనార్ధన రెడ్డి కేసులలో సీబీఐ ఏమి చేసిందో జగద్విదితమే. సో మొత్తానికి బీజీపీ అండతో తాను దాదాపు పాతికేళ్ళు పూజిన వెంకన్న ఆలయం మీద వివాదాన్ని సృష్టించేందుకు కూడా రమణ దీక్షితులు వేనుకాదడంలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.