సొంత ఖర్చు, బలగంతో బాబుకు ఓట్లు వేయించిన జగన్.

reason behind jagan targeting on chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తీరని కోరికలు ఏమైనా ఉంటే అవి కలల రూపంలో వస్తాయని చెప్తుంటారు. అందులో నిజం ఎంతో గానీ వైసీపీ అధినేత జగన్ దాదాపు అలాంటి పనే చేశారు. అనంతపురం జిల్లాలోకి వస్తూనే దేశం మొత్తం మీద చంద్రబాబు అంత చెత్త సీఎం ఇంకెక్కడా లేడని విమర్శించాడు. చంద్రబాబు గురించి ఇన్నాళ్లు తిట్లు ప్రయోగించిన జగన్ ఇప్పుడు హఠాత్తుగా ఆయన పనితీరు గురించి మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగించింది. ఇలా ఎందుకు జరిగిందా అని ఆరా తీసినప్పుడు ఆశ్చర్యకర విషయాలు వెలుగుజూశాయి.



చంద్రబాబు,జగన్ మధ్య తేడా తెలుసుకోడానికి ఇటీవల ప్రశాంత్ కిషోర్ జరిపిన సర్వే లో ఓ షాకింగ్ ఫలితం వచ్చిందట. రాజకీయ కారణాలు, అభిమానాలతో సంబంధం లేకుండా సామాన్యులు చాలా మంది జగన్ తో పోల్చినప్పుడు చంద్రబాబు పాలన, అనుభవం మీద సానుకూలత వ్యక్తం చేశారట. 2019 ఎన్నికల్లో సైతం చంద్రబాబు గెలిస్తేనే ఈ రాష్ట్రం ఓ గాడిలో పడుతుందని నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందట. ఈ ఫలితాలు చూడగానే కడుపు మండిన జగన్ అర్జెంటు గా తనను తాను చంద్రబాబు కన్నా గొప్పగా చిత్రీకరించుకోవాలి అనుకున్నారట.



ఆ పని జరగాలంటే ముందు చంద్రబాబు పనికిరాని వాడని చూపించాలి కాబట్టి ఓ సోషల్ మీడియా కేంద్రంగా “ మై వోట్ టుడే “ పేరుతో దేశంలో వరస్ట్ సీఎం ఎవరు అని ఓ సర్వే నిర్వహించారు. దాన్ని నిర్వహించినవాళ్లు, అందులో పాల్గొని ఓట్లు వేసిన వాళ్ళు అంతా వైసీపీ అనుకూల వర్గాలే. ఈ సర్వేలో దేశంలో వరస్ట్ సీఎం గా చంద్రబాబుని 50 శాతానికి పైగా ఓట్లతో గెలిపించిన జగన్ టీం ఆయనకు ఈ విషయాన్ని చేరవేశారు. ఈ విషయాన్ని జనానికి చేరవేయడానికి జగన్ బహిరంగ సభలో చంద్రబాబు అంత చెత్త సీఎం లేడంటూ కామెంట్ చేసాడు. మొత్తానికి తమ ఖర్చు,బలగంతో బాబుని గెలిపించి ఆయన్ని బద్నామ్ చేయడానికి ప్లాన్ చేశారు గానీ చంద్రబాబు చెత్త సీఎం అవునో కాదో చెప్పాల్సింది జనం కానీ జగన్ అండ్ కో కాదు. ఈ ఎపిసోడ్ చూస్తుంటే సీఎం కావాలన్న తీరని కోరికను జగన్ ఇలా తీర్చుకుంటున్నట్టు లేదు.

chandra-babu-and-jagan-moha