Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత సంవత్సరం ‘పెళ్లి చూపులు’ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు ప్రమోట్ చేయడంతో భారీ లాభాలు దక్కాయి. నిర్మాత రాజ్ కందుకూరితో పాటు సురేష్‌బాబు, డిస్ట్రిబ్యూటర్లు ఇలా అంతా కూడా లాభాలను పొందారు. అదే టీంతో ‘మెంటల్ మదిలో’ అనే చిత్రం వచ్చింది. రాజ్ కందుకూరి నిర్మించిన ఆ చిత్రంను మళ్లీ సురేష్‌బాబు సమర్పించాడు. సురేష్‌బాబు సమర్పణలో సినిమా రావడంతో మళ్లీ పెళ్లి చూపులు సీన్ రిపీట్ అవుతుందని అంతా భావించారు. కాని షాకింగా మెంటల్ మదిలో చిత్రం ఫ్లాప్ అయ్యింది. ఆశించిన కలెక్షన్స్‌ను రాబట్టలేక పోయింది.
‘పెళ్లి చూపులు’ తరహాలోనే ఈ సినిమాను ప్రమోట్ చేశారు. సినీ ప్రముఖులు మరియు మీడియా వ్యక్తుల నుండి ‘మెంటల్ మదిలో’ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. కాని సినిమా కలెక్షన్స్ మాత్రం తీవ్రంగా నిరాశ పర్చాయి. నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. ఈ విషయాన్ని సురేష్‌బాబు వివరిస్తూ సినిమా అంతా బాగానే ఉన్నా కూడా ఏ కారణంగా కలెక్షన్స్‌ను రాబట్టలేక పోయింది అనే విషయాన్ని విశ్లేషించాం.
చివరకు ఈ చిత్రం టైటిల్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విఫలం అయ్యింది. సాదారణ ప్రేక్షకులకు టైటిల్ కాస్త కన్వ్యూజన్ను క్రియేట్ చేసింది. అందుకే సినిమాకు కలెక్షన్స్‌ను రాలేదు. తాము అనుకున్న కథకు తీసిన కథకు టైటిల్ కరెక్ట్‌గా యాప్ట్ అయ్యింది. కాని ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మాత్రం టైటిల్ లేదు అని, అందుకే కలెక్షన్స్ రాలేదు అని ఈ సందర్బంగా సురేష్‌బాబు అన్నాడు.