Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ హీరో విశాల్ హఠాత్తుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అందరికి షాకింగ్‌గా ఉంది. నిన్న మొన్నటి వరకు సినిమా పరిశ్రమలో వివాదాలు, గొడవలతో ఉన్న విశాల్ ఒక్కసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. విశాల్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలో రాజకీయాల్లోకి రావడం ఏంటని, ఆయన వెనుక ఎవరో ఉన్నారు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్నట్లుగానే విశాల్ వెనుక టీటీవీ దినకరన్ ఉన్నాడు అంటూ అన్నాడీఎంకే పార్టీ నాయకుడు మధుసుధన్ ఆరోపిస్తున్నాడు.
రాజకీయాల్లోకి వచ్చిన విశాల్‌పై కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేయడం మొదు పెట్టారు. విశాల్ గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఆ కారణంగానే శశికళ మరియు దినకరన్‌లు విశాల్‌ను రంగంలోకి దించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విశాల్‌ను తమ కోసం వినియోగించుకునేందుకు శశికళ ఈ ప్రయత్నాలు చేస్తుందని అన్నా డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. విశాల్ ఆర్కే నగర్‌లో పోటీ చేయడం వెనుక ఖచ్చితంగా శశికళ ఉందని ఎక్కువ శాతం రాజకీయ వర్గాల వారు భావిస్తున్నారు. అయితే విశాల్ మాత్రం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నాను తప్ప తన వెనుక ఎవరు లేరు అంటూ చెబుతున్నాడు. విశాల్ గెలుపు సాధ్యమా లేదా అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం విశాల్ వెనుక ఉన్నది ఎవరు అనే చర్చ జోరుగా సాగుతుంది.