Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. చిత్ర విచిత్రమయిన వాతావరణం నెలకొననుంది. ఓ వైపు ఎండలు మంట పుట్టిస్తుంటే మరోవైపు పిడుగులు వణికించనున్నాయి. దీంతో ప్రకృతి ప్రకోపానికి గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ప్రజలని అప్రమత్తం చేస్తోంది. రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోనున్నయి జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తుండగా మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడనున్నాయి అలెర్ట్ గా ఉండాలంటూ వాతావరణ శాఖ ప్రకటించింది. అనంతపురం జిల్లా నుంచి కోస్తా జిల్లాల వరకు ఎండలు మరింత మండిపోవడం ఖాయమని, మూడు ఉత్తరాది జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి… ముఖ్యంగా బొబ్బిలి, విజయనగరం, పార్వతీపురం, ఆముదాలవలస, ఇచ్చాపురం, పలాస ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది… ఈ మూడు జిల్లాల్లో అధిక మండలాల్లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో ప్రజల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే ప్రజలు సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ శాఖ అధికారులు సూచనలు చేశారు. మే 1,2 తేదీల్లో… ఈ రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకోవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని సూచిస్తున్నారు అధికారులు.