పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తాజాగా రెండవ పెళ్లికి సిద్దం అయ్యింది. జీవితాంతం ఒంటరిగా జీవించడం కష్టం అని నిర్ణయించుకున్న రేణుదేశాయ్ తనకు ఆప్తుడు, తెలిసిన వ్యక్తిని వివాహం చేసుకునేందుకు సిద్దం అయ్యింది. ఇప్పటికే వీరిద్దరి వివాహ నిశ్చితార్థం కూడా జరిగి పోయింది. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ విశాఖ యాత్ర కోసం అక్కడికి చేరుకున్నారు. అయితే ఈసారి ఆయనతో పాటు కొడుకు అకీరా, కూతురు ఆద్య కూడా విశాఖ రావడం ఆశ్చర్యం కలిగించింది.
అమ్మ ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ లో కనిపించిన ఆ ఇద్దరు ఇప్పుడు తండ్రి పొలిటికల్ టూర్ కి తోడుగా రావడం విశేషమే. ఈ ఇద్దరితో కలిసి పవన్ రిసార్ట్ లో బస చేయడం మీద భిన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తల్లి రేణు దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకోవడం వీరికి ఇష్టం లేకనే తండ్రి దగ్గరకు వచ్చారని కొందరు అంటున్నారు. తల్లి రెండవ పెళ్లి ఇష్టం లేక పోవడం వల్లే అకీరా అలిగి తండ్రి వద్దకు వచ్చాడు అంటూ కొందరు పుకార్లు పుట్టించిన నేపథ్యంలో ఆ విషయమై రేణుదేశాయ్ తాజాగా ఒక ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.
అకీరాకు తాను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని మీడియాలో వచ్చిన వార్తలు చూసి నవ్వుకున్నాను. నా నిశ్చితార్థంలో అతడు సరదాగా గడిపాడు. అతడు పూర్తి సంతోషంగా ఉన్నాడు. అకీరా .నిశ్చితార్థం సందర్బంగా అలిగిన మాట నిజమే కాని, అది నిశ్చితార్థం వల్ల కాదని, మెనూలో పన్నీర్ బటర్ మసాలా లేదని అకీరా అలిగాడు అంటూ రేణుదేశాయ్ జోక్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రేణుదేశాయ్ రెండవ పెళ్లి విషయం గురించి చర్చించుకుంటున్నారు. రేణు పెళ్లి చేసుకోబోతున్న సమయంలో పవన్ కళ్యాణ్ కూడా హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలిపి, ఆమె జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటూ ట్వీట్ చేశాడు. కొత్త జీవితంలో హాయిగా జీవించండి రేణు గారు అంటూ పవన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. పవన్ ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ కాస్త అయిన సైలెంట్ అవుతారేమో చూడాలి. గత వారం రోజులుగా రేణుదేశాయ్‌ని వివాహం చేసుకోవద్దంటూ హెచ్చరిస్తూ వస్తున్న విషయం తెల్సిందే.