Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్టార్ మాటీవీలో బిగ్‌బాస్ షో ముగిసిన వెంటనే ప్రారంభం అయ్యింది ‘నీతోనే డాన్స్’. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఈ డాన్స్ షోలో జడ్జ్‌గా వ్యవహరించడంతో షోపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ షోలో రియల్ లైఫ్ భార్య భర్తలు డాన్స్‌లతో ఆకట్టుకుంటున్నారు. ఈ షోపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇందులో డాన్స్ చేస్తున్న పార్టిసిపెంట్స్‌కు సరిగా డాన్స్ రావడం లేదు, వారు చాలా కష్టపడుతున్నారు కాని ఫలితం దక్కడం లేదు అంటూ కొందరు హేలన చేస్తున్నారు. తాజాగా ట్విట్టర్లో ఒక వ్యక్తి రేణుదేశాయ్‌ను ఉద్దేశించి ‘నీతోనే డాన్స్’లో డాన్స్ చేస్తున్న వారు డాన్స్ మానేసి సీరియల్స్ చేసుకోవడం బెటర్ అంటూ కామెంట్స్ చేశారు.
అతడి ట్వీట్‌కు రేణుదేశాయ్ కూల్‌గా దిమ్మతిరిగిపోయేలా రిప్లై ఇచ్చింది. నీతోనేడాన్స్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో. ఇదేమీ డాన్స్ రియాల్టీ షో కాదు. రియల్ లైఫ్ కపుల్స్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు డాన్స్‌లు చేస్తున్నారు. వారేం ప్రొఫెషనల్ డాన్సర్స్ కాదు. ప్రొఫెషనల్ డాన్సర్స్‌కు వేరే షోలు ఉంటాయి. ఇది కేవలం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు మాత్రమే, దయచేసి వారిని ఎంకరేజ్ చేయాలి కాని, ఇలా నిరుత్సాహ పర్చకండి, వారు ఇచ్చే వినోదాన్ని ఆస్వాదించాలి కాని, వారు చేస్తున్న డాన్స్‌లలో తప్పులు వెదకకండి అంటూ రేణుదేశాయ్ సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానంతో అతడు సైలెంట్ అయ్యాడు.
అతడు మాత్రమే కాదు ‘నీతోనే’ డాన్స్ గురించి విమర్శలు చేస్తున్న ఎంతో మందికి రేణుదేశాయ్ వివరణ సంతృప్తికరంగా ఉండి ఉంటుంది. ఇదొక ఎంటర్టైన్మెంట్ షోగా చూడాలి తప్ప ఒక డాన్స్ రియాల్టీ షోలా చూడవద్దని రేణుదేశాయ్ సూచనను అంతా కూడా సమర్ధిస్తున్నారు.