Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత కూడా రేణుదేశాయ్‌కు విపరీతమైన క్రేజ్ తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. ఆమె దాదాపు అయిదు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులు ఏదో విధంగా దగ్గర అవ్వాలని ప్రయత్నించి చివరకు స్టార్ మాటీవీలో ప్రసారం అవుతున్న నీతోనే డాన్స్ అనే షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షో ప్రస్తుతం మంచి టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది. బిగ్‌బాస్‌కు మంచి ప్రత్యామ్నాయంగా ఈ షోను బుల్లి తెర వర్గాల వారు అభివర్ణిస్తున్నారు. రేణు దేశాయ్ ఉండటం వల్ల షో రేటింగ్ రెట్టింపు వస్తుందని బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సాదారణంగా అయితే ఇలాంటి షోలకు జడ్జ్‌లుగా వ్యవహరించే వారికి రెండున్నర లక్షల నుండి మూడు లక్షల వరకు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. కాని రేణు దేశాయ్ మాత్రం అయిదు లక్షల కంటే ఎక్కువ పారితోషికాన్ని అందుకుంటున్నట్లుగా స్టార్ మా వర్గాల నుండి సమాచారం అందుతుంది. అయిదు లక్షలతో పాటు అదనంగా ఆమె ఖర్చులను కూడా షో నిర్వాహకులు భరించనున్నారు. వారంకు అయిదు లక్షల పారితోషికం. వారంలో రెండు రోజుల పాటు ఈ షో ప్రసారం అవుతుంది. రెండు రోజుల ఎపిసోడ్‌ను సాదారణంగా ఒకే రోజులో చిత్రీకరిస్తారు. ఏదైనా ప్రత్యేక సందర్బాల్లో మాత్రమే రెండు రోజుల పాటు చిత్రీకరణ ఉంటుంది. రెండు ఎపిసోడ్లకు కలిపి అయిదు లక్షలు అన్నమాట. ఇంత భారీ మొత్తం పారితోషికం తెలుగులో మొదటి సారి రేణుదేశాయ్ తీసుకుంటున్నారు. నీతోనే డాన్స్ సీజన్ పూర్తి అయ్యే వరకు రేణు దేశాయ్‌కి భారీ మొత్తంలో పారితోషికం ముట్టే అవకాశం ఉంది. దాదాపుగా 50 నుండి 65 లక్షల వరకు ఆమె అందుకుంటుందని స్టార్ మా వారు అనధికారికంగా చెబుతున్నారు