Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
- మీ నాయకత్వంలో చేసిన పోరాటాలు నాకు గొప్ప అనుభవాన్నిచ్చాయి.
- సుదీర్ఘ రాజకీయ, పాలన అనుభవం ఉన్న మీతో ప్రయాణం మరిచిపోలేనిది.
- మీ సారథ్యంలో అనేక ప్రజాపోరాటాలలో భాగస్వామి కావడం అదృష్టం.
- మీ అనుచరుడుగా, టీడీపీ నేతగా గుర్తింపు పొందడం నేను గర్వించే విషయం.
- టీడీపీలో చేరిన నాటి నుంచి ఈ క్షణం వరకు పార్టీ సిద్ధాంతం, మీ నిర్ణయాలకు కంకణబద్దుడనై పని చేశాను.
- తక్కువ సమయంలో మీరు, పార్టీ నాకు గుర్తింపునిచ్చారు.
- సీనియర్లు ఉన్నా నాకు కీలక అవకాశాలిచ్చారు.
- వాటన్నింటినీ నా శక్తిమేరకు సమర్ధవంతంగా నిర్వర్తించానని నమ్ముతున్నాను.
- కార్యకర్తలతో నా అనుబంధం విడదీయరానిది.
- వాళ్లు నన్ను తమ ఇంట్లో మనిషిగా అభిమానించారు.
- పోరాటాల్లో నా వెన్నంటి ఉన్నారు.
- మీ ప్రోత్సాహం, వాళ్లిచ్చిన ధైర్యంతో నలభై నెలలుగా కేసీఆర్ అరాచకాల పై పోరాడాను.
- ఎన్టీఆర్ కూడా నా పోరాటానికి స్ఫూర్తి.
- అన్నగారితో నేరుగా అనుబంధం లేకపోయినా పేదోళ్ల బాగుకోసం ఆయన తపించిన విధానం నాకు స్ఫూర్తి.
- టీడీపీతో బంధం తెంచుకోవడం నాకు గుండె కోతతో సమానం.
- కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాబిన్నమయ్యాయి.
- ఏ వర్గాన్ని తట్టి చూసినా కష్టాలు కన్నీళ్లే కనిపిస్తున్నాయి.
- వేల మంది రైతులు పిట్టల్లా రాలుతున్నా పట్టించుకున్న పాపానపోలేదు.
- గిరిజన రైతులకు బేడీలు వేసి ఆత్మగౌరవం దెబ్బతీశారు.
- మల్లన్న సాగర్ ను రావణకాష్టంగా మార్చారు.
- నేరేళ్లలో దళిత, బీసీ బిడ్డలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.
- భూపాలపల్లిలో గుత్తికోయల ఆడబిడ్డలను బట్టలూడదీసి చెట్లకు కట్టేసి కొట్టారు.
- ఇలాంటి హృదయవిదారక సందర్భాలు అనేకం.
- ప్రతిపక్షాల ఉనికిని కేసీఆర్ సహించలేకపోతున్నారు.
- ప్రజాస్వామిక హక్కులకు రాష్ట్రంలో చోటు లేదు.
- వ్యవస్థల పతనం నిరాఘాటంగా సాగుతోంది.
- ప్రశ్నిస్తే గొంతు నొక్కడం..అసెంబ్లీలో సస్పెన్షన్ లు నిత్యకృత్యమయ్యాయి.
- నాపై వ్యక్తిగతంగా కక్షగట్టి అక్రమ కేసుల్లో ఇరికించిన విషయం మీకు తెలుసు.
- జైల్లో పెట్టిన సందర్భంలోనూ నేను వెనకడుగు వేయలేదు.
- నా బిడ్డ నిశ్చితార్థానికి కోర్టు కొన్ని గంటలు మాత్రమే అనుమతించిన సందర్భంలోనూ గుండెనిబ్బరం కోల్పోలేదు.
- ఆ సమయంలో మీరు, భువనేశ్వరి మేడమ్ కుటుంబ పెద్దలుగా నిలిచినందుకు కృతజ్ఞతలు.
- కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయింది.
- బంగారు తెలంగాణ ముసుగులో ప్రజా సంపద అడ్డగోలుగా దోపిడీ అవుతోంది.
- అమరవీరుల ఆత్మబలిదానాలకు గుర్తింపు లేదు.
- తెలంగాణ సమాజం ఏకతాటిపై నిలబడి కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అనివార్యత కనిపిస్తోంది.
- తెలంగాణ సమాజ హితం కోసం నేను మరింత ఉదృతంగా పోరాడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
- తెలంగాణ సమాజం కేసీఆర్ కు వ్యతిరేకంగా బలమైన రాజకీయ పునరేకీకరణ కోరుకుంటోంది.
- నా నిర్ణయాన్ని ఆ కోణంలోనే చూడండి.
- కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం, శాసన సభ సభ్యత్వానికి రాజీనామ చేస్తున్నాను.
- తెలంగాణ హితం కోసం మరింత విస్తృత పోరాటానికి సిద్ధమవుతున్నాను.
- అన్యదా భావించక నా నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.