Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ విషయంలో అయినా కాస్త అతిగా వ్యాఖ్యలు చేస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు. చిన్న విషయానికి కూడా వర్మ అతిగా రియాక్ట్ అవుతూ, లేని దాన్ని ఉన్నట్లుగా క్రియేట్ చేసి చూపింగల సమర్ధుడు వర్మ. తాజాగా ఈయన కన్నడ చిత్రం ‘టగరు’ ప్రత్యేక షోను వర్మ చూశాడు. ఈ సందర్బంగా వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ చిత్రంపై వర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా హీరోయిన్‌పై వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమెకు తాను ఫిదా అయినట్లుగా వర్మ బాహాటంగానే చెప్పేశాడు.
తాను తెరకెక్కించబోతున్న తర్వాత సినిమాలో ఖచ్చితంగా ‘టగరు’ హీరోయిన్ మాన్విత హరీష్‌ను ఎంపిక చేస్తాను అని, ఆమె అద్బుతమైన నటన మరియు అందం నన్ను కట్టి పడేసిందని చెప్పుకొచ్చాడు. ఆమె కోరిన పారితోషికంకు అదనంగా పది లక్షలు ఇచ్చి మరీ ఆమెను హీరోయన్‌గా ఎంపిక చేస్తాను అంటూ వర్మ చెప్పడం అందరిని ఆశ్చర్యపర్చింది. మాన్విత కోసం మరోసారి సినిమా చూడాలనుకుంటున్నట్లుగా మీడియాకు చెప్పుకొచ్చాడు. ఇలాంటి వ్యాఖ్యలు వర్మ అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాడు. అయితే ఈసారి వర్మ అన్నట్లుగా తన తర్వాత సినిమాలో హీరోయిన్‌గా మాన్వితకు ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి. తనను మాత్రమే కాకుండా ‘టగరు’ చిత్రం చూసిన ప్రతి ఒక్కరిని కూడా మన్విత కట్టి పడేయడం ఖాయం అని, ఆమె సౌత్‌లో స్టార్ హీరోయిన్ అవుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పుకొచ్చాడు.