Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సాధువులు, సంతులు అందులోనూ ముఖ్యంగా హిందుత్వ ఓట్లను పటిష్ఠం చేసే క్రమంలో.. ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ కు మోడీ బాధ్యతలు అప్పగించారు. ఈ విషయంలో మోడీ విచక్షణ కంటే.. ఆరెస్సెస్ ఆపేక్షే ఎక్కువగా ఉందని అప్పట్లోనే వార్తలొచ్చాయి. అయితే తొలినాళ్లలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్న యోగి.. యూపీ సీఎంగా బాగా పాపులరయ్యాయి.
కానీ యాంటీ రోమియో స్క్వాడ్లే రేప్ లు చేయడం, ఘర్షణలు కొనసాగడం, ఇక గోరఖ్ పూర్ ఆస్పత్రిలో శిశుమరణాలు.. వెరసి యోగి సర్కారుపై ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. యోగి ఆదిత్యనాథ్ గ్రాఫ్ దిగజారుతోందని 2024కు ఆయన్ను పీఎం చేద్దామనుకున్న ఆరెస్సెస్ కూడా ఆందోళనలో పడింది. అందుకే ఆరెస్సెస్ బీజేపీ సమన్వయ సమావేశాల్లో యోగికి ఫుల్లుగా తలంటిందట.
యూపీ లాంటి పెద్ద రాష్ట్రాన్ని అప్పగిస్తే.. ఏం చేస్తున్నారని సీఎం, డిప్యూటీ సీఎంలకు బాగా అక్షింతలు పడ్డాయి. స్వయంగా మోహన్ భగవత్ మండిపడటంతో నేతలు బాగా ఇబ్బందిపడ్డారట. మహిళలపై అత్యాచారాలు ఆగలేదని, గోరఖ్ పూర్ ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని భగవత్ కాస్త హెచ్చరిక స్వరంతోనే చెప్పారని ఆరెస్సెస్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. సో యోగీ పనితీరు మెరుగుపడకపోతే.. కొత్త సీఎం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనేది కాషాయ వర్గాల దగ్గరున్న సమాచారం.
మరిన్ని వార్తలు: