Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ రజినీకాంత్, రంజిత్ పాల కాంబినేషన్లో ధనుష్ నిర్మించిన కాలా చిత్రం విడుదల గత కొన్ని నెలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే కాలా చిత్రం మరో సారి వాయిదా పడ్డట్లే కనిపిస్తోంది. ‘కాలా’ చిత్రంకు సంబంధించిన కొన్ని నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కాలేదని, దాంతో ‘కాలా’ను వాయిదా వేస్తున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే మీడియాలో వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు స్పందించింది లేదు.
తమిళనాట గత కొంత కాలంగా బంద్ జరుగుతుంది. ఆ బంద్ కారణంగా కాలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదని, ఆ బంద్ ఎప్పటికి ముగుస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉందని, ఆకారణంగానే ‘కాలా’ చిత్రం విడుదల ఇప్పట్లో లేనట్లే అంటున్నారు. ఏప్రిల్‌లో ‘కాలా’ చిత్రం విడుదల అయితే మహేష్‌బాబు ‘భరత్ అను నేను’ మరియు అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రాలకు ఇబ్బందులు తప్పవని అంతా భావించారు. కాని కాలా విడుదల వాయిదా పడటంతో ఇప్పుడు ఆ రెండు సినిమాల నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ‘కాలా’తో పాటు రజినీకాంత్ ‘2.0’ చిత్రం కూడా గత కొన్ని నెలలుగా వాయిదాలు పడుతూ వస్తున్న విషయం తెల్సిందే.