అనుష్క ఆరోగ్యంపై పుకార్లు

rumours-about-the-health-of

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘బాహుబలి’ చిత్రంలో దేవసేన పాత్రలో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న అనుష్క సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుంది. ‘బాహుబలి 2’ చిత్రం తర్వాత అనుష్క ఇప్పటి వరకు మరో సినిమాకు కమిట్‌ అయ్యిందే లేదు. కారణం బరువు తగ్గటం అంటూ చెబుతూ వస్తున్నారు. ‘బాహుబలి’లో నటిస్తున్న సమయంలోనే అశోక్‌ దర్శకత్వంలో ‘భాగమతి’ అనే చిత్రాన్ని కమిట్‌ అయ్యింది. ఆ సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. ఇన్నాళ్లకు విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే నెలలో రిపబ్లిక్‌ డే సందర్బంగా సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఇక అనుష్క ఇతర చిత్రాలను కమిట్‌ కాకపోవడం వెనుక అనారోగ్య కారణాలున్నాయి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

anushka-shetty

అనుష్క ‘సైజ్‌ జీరో’ చిత్రం కోసం చాలా లావు పెరిగింది. లావు తక్కువ అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కాని ఆమె ప్రయత్నాలు వెంటనే సఫలం కాలేదు. లావు తగ్గేందుకు చేసిన ప్రయత్నాల కారణంగా అనుష్క అనారోగ్యం పాలైందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత మూడు నెలలుగా అనుష్క ఆరోగ్యం సరిగా ఉండటం లేదని, ఆమె పలు ప్రాంతాల్లో చికిత్స తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

anushka

అనుష్క అరోగ్యంపై వస్తున్న పుకార్లు ఎంత వరకు నిజం అనేది తెలియదు కాని, అనారోగ్యం కారణంగానే సినిమాలకు ఓకే చెప్పడం లేదు అనే ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అనుష్క నుండి లేదా ఆమె మేనేజర్‌ నుండి ఆరోగ్య విషయమై క్లారిటీ రావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అనుష్క మీడియా ముందుకు వచ్చి చాలా కాలం అయ్యింది. ఇటీవలే ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. బక్కగా అయిన అనుష్క త్వరలో సినిమాల్లో నటించే అవకాశాలున్నాయని భావిస్తున్న తరుణంలో ఇలా అనారోగ్య వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.