‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు వర్మ అసిస్టంట్ అనే కామన్ పాయింట్ తప్ప సినిమా గురించి ఇంకేమీ చెప్పుకోడానికి లేదు. హీరో హీరోయిన్లు కొత్తవాళ్లు కావడంతో, విడుదలకి ముందు ఈ సినిమాను గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చాలా చిన్న సినిమాగానే థియేటర్లకు వచ్చిన ‘ఆర్ ఎక్స్ 100’ భారీ విజయాన్ని నమోదు చేసి అంతే రేంజ్ లో వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. తొలి రోజున తొలి ఆట నుండే యూత్ ఈ సినిమాకి నీరాజనం పట్టడంతో ఈ సినిమా భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. నేటి సమాజంలో కామన్ గా జరుగుతున్న పాయింట్ తో అల్లుకున్న కధ కావడంతో యూత్ కి సినిమా బాగా కనెక్ట్ అయింది. లవ్ స్టోరీకి రొమాంటిక్ టచ్ ఇచ్చి, తన గురువు ఆర్జీవీ మార్క్ తీసుకుని రక్తాలు వచ్చీ ఫైట్ సీన్లు ఈ సినిమాకి మరింత ప్లస్ గా మారింది. రెండు రాష్ట్రాల్లో రెండు రోజులకు గాను ఈ సినిమా 2.51 కోట్ల షేర్ ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. శని .. ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
#RX100 AP & Nizam
రెండో రోజు షేర్ ఏరియాల వారీగా
నైజాం – 50 Lks
సీడెడ్ – 12 Lks
ఉత్తరాంధ్ర -14 Lks
తూర్పు – 9.72 Lks
పశ్చిమ – 5.65 Lks
కృష్ణా – 6.72 Lks
గుంటూరు – 7 Lks
నెల్లూరు – 3 Lks
రెండో రోజు షేర్ – 1.08 Crs
రెండు రోజుల షేర్ – 2.5Crs