Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ చరణ్, సుకుమార్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం 1980ల నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెల్సిందే. అప్పటి పరిస్థితులు మరియు పరిసరాల కోసం ఒక భారీ సెట్టింగ్‌ను దర్శకుడు సుకుమార్ వేయించాడు. సినిమాలో ఎక్కువ శాతం సీన్స్‌ను అక్కడే చిత్రీకరించారు. ఆ సెట్టింగ్‌ను పలువురు సినీ ప్రముఖులు సందర్శించారు. 1980 పరిస్థితులకు అద్దం పట్టేలా అద్బుతంగా దర్శకుడు సుకుమార్ ఆ సెట్టింగ్‌ను వేయించి అహో అనిపించాడు. ఆ మద్య రాజమౌళి కూడా చూసి వావ్ అంటూ తన అభిప్రాయంను వ్యక్తం చేశాడు. తాజాగా మరోసారి రంగస్థలం ఊరు సెట్టింగ్‌ను రాజమౌళి సందర్శించాడు.
‘రంగస్థలం’ ఊరు సెట్టింగ్‌ను రాజమౌళి రెండవ సారి చూసేందుకు వెళ్లడంపై పలువురు పలు రకాలుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ ఈ సెట్టింగ్‌ను రాజమౌళికి దాదాపు గంట పాటు అంతా తిప్పి చూపించాడట. రాజమౌళి తన తర్వాత సినిమాకు ఈ సెట్టింగ్‌ను వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో రెండవ సారి ఆ సెట్స్‌ను పరిశీలించాడని తెలుస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో రాజమౌళి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ చిత్రీకరణ పల్లెటూర్లో చేయాల్సి ఉందట. ఆ కారణంగానే ఈ సెట్టింగ్‌ను రాజమౌళి ఉపయోగపడేనా అనే ఉద్దేశ్యంతో చూసినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి రంగస్థలంలో రాజమౌళి మల్టీస్టారర్ సీన్స్‌ను చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయమై చిత్ర యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ రావాల్సి ఉంది.