Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్నేహితులకు మనం స్థోమతను బట్టి కానుకలు ఇస్తుంటాం. మధ్య తరగతికి చెందిన సామాన్యులు ఒకరికొకరు ఇచ్చే కానుకలు ఎక్కువభాగం రూ. లక్ష లోపు ఖరీదుచేసేవే అయిఉంటాయి. కాస్త ఎబోవ్ మిడిల్ క్లాస్ కు చెందిన వారు అయితే…రూ. రెండు లేదా మూడు లక్షల రూపాయల రూపాయల బహుమతులు ఇస్తుంటారు. అవే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మరి కోట్లు సంపాదించి కూడబెట్టుకునే సెలబ్రిటీలు తమ స్నేహితులకు ఎలాంటి గిఫ్ట్ లు ఇస్తారు. బహుశా వారిచ్చే గిఫ్ట్ లన్నీ రూ. లక్షల ధరే పలుకుతాయి. అయితే ఎంత డబ్బున్నవాళ్లయినా…రూ. కోట్లు పెట్టి గిఫ్ట్ లు ఇవ్వరులే అనుకుంటాం. కానీ కొందరు సెలబ్రిటీలు తమకు బాగా ప్రత్యేకమైన స్నేహితులకు రూ. కోట్ల రూపాయలు ఖరీదు చేసే గిఫ్ట్ లు కూడా ఇస్తుంటారు.
దీనికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కరే ఉదాహరణ. ఆయన వీరేంద్ర సెహ్వాగ్ కు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే ఎవరికైనా అమ్మో అని..ఆశ్చర్యం కలగకమానదు. బీఎండబ్ల్యూ 730ఎల్ డీ కారును సచిన్ సెహ్వాగ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ కారు విలువ రూ. 1.14కోట్లు. సచిన్ తనకు బహుమతిగా ఇచ్చిన కారును ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సెహ్వాగ్ ఆయనకు థాంక్స్ చెప్పాడు. సచిన్, సెహ్వాగ్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ భారత జట్టుకు ఆడే సమయంలో ఏర్పడ్డ పరిచయం క్రమేణా విడదీయలేని స్నేహానికి దారితీసింది. జట్టు ఓపెనర్లుగా వారిద్దరూ భారత్ కు చిరస్మరణీయ విజయాలు అందించారు. సెహ్వాగ్ అయితే సచిన్ ను క్రికెట్ దేవుడిగా ఆరాధిస్తాడు. సచిన్ స్ఫూర్తితోనే తాను క్రికెట్ లోకి వచ్చానని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు సెహ్వాగ్. ఢిల్లీలోని నజఫ్ గఢ్ ప్రాంతానికి చెందిన సెహ్వాగ్ ను చిన్నతనంలో అందరూ నజఫ్ గఢ్ టెండూల్కర్ అని పిలిచేవారట.