అమరావతి: భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR) కు గాయమైందని తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవం తుడిని ప్రార్థిస్తున్నాను. ఎన్నో సవాళ్లను అధిగమించిన ఆయన.. ఈ అనారోగ్య పరిస్థితులనూ మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం నాకుంది. పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజలకు, సమాజానికి తన సేవలు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నాను’’ అని పవన్ పేర్కొన్నారు.