Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా హీరో సాయిధరమ్ తేజ్ వరుసగా చిత్రాలను చేస్తూ దూసుకు పోతున్నాడు. త్వరలో ‘జవాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే కరుణాకరన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు. ఇప్పటికే ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. గతంలో కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ‘తొలిప్రేమ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు ఇది సీక్వెల్ లేదా ప్రీక్వెల్ అంటూ ప్రచారం జరుగుతుంది. లేదంటే అదే కథతో కాస్త మార్పులు చేర్పులు చేసి రీమేక్ చేయబోతున్నారు ప్రచారం జరుగుతుంది.
మీడియాలో వస్తున్న వార్తలపై సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. తాను కరుణాకరన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ‘తొలిప్రేమ’కు అస్సలు సంబంధం లేదని, అసలు ఆ కథ మరియు ఈ కథ పూర్తి విభిన్నంగా ఉంటుందని. తాను చేస్తున్నది ఒక విభిన్నమైన ప్రేమ కథ అని, కరుణాకరన్ మార్క్‌లో ఈ ప్రేమ కథ ఉంటుందని తేజూ చెప్పుకొచ్చాడు. వచ్చే వేసవి ఆరంభంలో వినాయక్ చిత్రంతో, వేసవి చివర్లో లేదా దసరా సందర్బంగా కరుణాకరన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను విడుదల చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా తేజూ చెప్పుకొచ్చాడు. ఈ రెండు చిత్రాలతో పాటు దిల్‌రాజు నిర్మాణంలో ఒక సినిమాను చేసేందుకు తేజూ సిద్దంగా ఉన్నాడు. అది కూడా వచ్చే ఏడాది విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.