Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మామకు తగ్గ అల్లుడు అనిపించుకుంటున్నాడు. చిరంజీవి కెరీర్ ఆరంభంలో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకు పోయేవాడు. ఇప్పుడు తేజూ కూడా అదే పద్దతిలో వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. సంవత్సరంలో మూడు నాలుగు సినిమాలు చేస్తున్న సాయి ధరమ్ తేజ్ రేపు ‘ఇంటిలిజెంట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. కొత్త తరహా కథతో, స్క్రీన్‌ప్లేతో సినిమాను చేసేందుకు ఆసక్తిని కనబర్చుతున్న సాయి ధరమ్ తేజ్ కొత్త వారితో సినిమాలు చేసేందుకు తాను ఎప్పుడు కూడా సిద్దంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు.
సాయి ధరమ్ తేజ్ ఇంకా మాట్లాడుతూ.. వెరైటీ కథలతో సినిమాలు చేయాలని తాను కోరుకుంటాను అని, అన్ని వరుసగా కమర్షియల్ సక్సెస్‌లు చేయాలని లేదని, ప్రయోగాత్మక చిత్రాన్ని చేయాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మంచి కథతో మల్టీస్టారర్ చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పిన సాయి ధరమ్ తేజ్ ఎలాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని అయినా చేసేందుకు సిద్దం అంటూ ప్రకటించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి తేజూ కోసం వెరైటీ కథలు ఎవరైనా తీసుకు వస్తారా లేదా అనేది చూడాలి. తేజూ ‘ఇంటిలిజెంట్’ చిత్రం తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. మెగా ఫ్యామిలీ హీరోల్లో సాయి ధరమ్ తేజ్ అత్యధికంగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.