Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు హీరోయిన్స్‌కు కాస్త ఫేం రాగానే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌తో బిజీ అవుతారు. పలు వస్త్ర దుఖానాలను వారితో ఓపెనింగ్ చేయించేందుకు, ఇంకా షాపింగ్ మాల్స్‌ను ఓపెనింగ్ చేయించేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపుతారు. తాజాగా ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవికి కూడా ఓపెనింగ్ ఛాన్స్‌లు మస్త్‌గా వస్తున్నాయి. మూడు నాలుగు గంటలు కేటాయిస్తే 15 నుండి 25 లక్షల వరకు సంపాదించే ఛాన్స్ ఉంది. కాని సాయి పల్లవి మాత్రం ఓపెనింగ్స్‌కు నో చెబుతూ ఉంది. ఎంత పారితోషికం ఇచ్చినా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినా కూడా ఆమె మాత్రం నాట్ ఇంట్రస్ట్ అంటే నాట్ ఇంట్రస్ట్ అంటుంది.
‘ఫిదా’ సక్సెస్‌తో ఈమెకు హీరోయిన్గా కూడా మస్త్ ఛాన్స్‌లు వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు దిల్‌రాజుకు తప్ప మరే నిర్మాతకు కూడా డేట్లు ఇచ్చింది లేదు. ‘ఫిదా’ చిత్రంతో తనను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దిల్‌రాజు బ్యానర్లోనే మరో రెండు లేదా మూడు సినిమాలను చేసేందుకు సాయి పల్లవి కమిట్ అయ్యింది. దిల్రాజును గాడ్ ఫాదర్ అంటూ చెప్పుకుంటూ ఇతర నిర్మాతలకు మొండి చేయి చూపుతుంది. 2018 మొత్తం దిల్ రాజు బ్యానర్లోనే సాయి పల్లవి నటించనుంది. 2019లో ఇతర నిర్మాతలకు సాయి పల్లవి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. డబ్బులను చూడకుండా తను ఎలా ఉండాలనుకుంటుందో అలాగే ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ఇలాంటి హీరోయిన్స్ చాలా చాలా అరుదుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈమె నానితో ఒక చిత్రాన్ని చేస్తోంది.
మరిన్ని వార్తలు: