అయితే, ఈ యాక్షన్ సీక్వెన్స్ లు ఎలివేషన్ లాగా ఉండవని, అవి కథను ముందుకు తీసుకు వెళ్ళే విధంగా ఉంటాయి అని పేర్కొన్నాడు. అన్ని ఫైట్ సీన్స్ కి ఎమోషనల్ టచ్ ఉంటుందని శైలేష్ తెలియచేసారు . సైంధవ్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, ఆర్య, బేబీ సారా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ సినిమా ని నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
విక్టరీ వెంకటేష్ “సైంధవ్” లో 9 ఫైట్ సీక్వెన్స్‌లు! విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన సైంధవ్ చిత్రం 2024 సంక్రాంతి సందర్భంగా థియేటర్ల లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి హిట్ ఫ్రాంచైజీ తో క్రేజ్ ని సొంతం చేసుకున్న శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో కథానాయిక గా నటిస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు శైలేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ గురించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సైంధవ్‌లో మొత్తం 9 ఫైట్ సీక్వెన్స్‌లు ఉంటాయని తెలిపారు.