Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అధికారమే పరమావధిగా రాజకీయాలు చేసి జనం ఛీకొడుతున్నా కొద్దిగా కూడా మారడం లేదు వైసీపీ అధినేత జగన్. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి పత్రిక రాజకీయ కారణాలతో రాయలసీమ వాసులకి తీరని అన్యాయం చేసేందుకు సిద్ధం అయ్యింది. సాక్షి చేసిన తప్పు ఏమిటో తెలిస్తే మాత్రం ఆ పత్రికను ఏపీ ప్రజలు ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా బ్యాన్ చేయడం గ్యారంటీ.
ఎప్పటినుంచో సీమవాసులు శ్రీశైలం ప్రాజెక్ట్ కి నీరు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్టు ఆ ప్రాజెక్ట్ నిండకపోయినా ఇటీవల పై భాగంలో కురిసిన వానలకి శ్రీశైలం కి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా కి నీరు అందిస్తున్న ఏపీ సర్కార్ వెంటనే సీమ విషయంలో కూడా అలెర్ట్ అయ్యింది. ఇంజినీర్లకు చెప్పి శ్రీశైలం నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని తోడేందుకు ప్రయత్నించింది. కొద్ది గంటలైనా గడవకముందే తెలంగాణ ఇంజినీర్లు వచ్చి అభ్యతరం తెలిపారు. దీంతో అనుకున్న స్థాయిలో పోతిరెడ్డిపాడుకి నీటిని తరలించలేకపోయారు. అప్పుడే విషయం ఎలా లీక్ అయ్యిందో అని ఇంజినీర్లు తర్జనభర్జన పడ్డారు. అయితే తెల్లవారి సాక్షి తెలంగాణ ఎడిషన్ చూస్తే అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.
” శ్రీశైలంలోకి నీటి ప్రవాహాలు కొనసాగుతూ మట్టాలు పెరుగుతుండడంతో గరిష్ట నీటి వినియోగం మీద కన్నేసిన ఆంధ్రప్రదేశ్… ఊహించినట్టుగానే పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తోడే చర్యలకి దిగింది. మంగళవారం ఉదయం ఐదు గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని తోడేందుకు ప్రయత్నించింది….” ఇలా సాగిన ఆ పత్రిక కధనం ఇప్పుడు ఏపీ లో వైసీపీ కి సమాధి కట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ ఏదైనా తప్పు చేసి ఉంటే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడం సహజం. అయితే ఏపీ లో ముఖ్యమంత్రి కావాలి అని కలలు కంటున్న వ్యక్తి, రాయలసీమ ప్రజలు బ్రహ్మరధం పట్టిన పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సాగుతున్న పత్రిక ఇప్పుడు అదే సీమ ప్రజల నోట్లో మట్టికొట్టడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోవాలా ? రాజకీయ లబ్ది కోసం గుక్కెడు నీళ్ల కోసం ఎదురు చూస్తున్న సీమ ప్రజలకు సాక్షి చేసిన అన్యాయం సామాన్యుడికి చేరితే ఆ పత్రిక కి పుట్టగతులు ఉంటాయా ? దాన్ని నడిపిస్తున్న వారికి రాజకీయ భవిష్యత్ ఉంటుందా ? . జనం పిచ్చివాళ్ళు అనుకుని ఇలా చేసే ఇప్పటికే ఆ పార్టీ మట్టికొట్టుకుపోతోంది. అయినా ఇంకా మారకుండా ఏపీ ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టి అదే రాష్ట్రానికి సీఎం కావాలని కోరుకోవడం సిగ్గుచేటు. అయితే ఇలాంటి విషయాల్లో మీరు కళ్ళు మూసుకున్నారేమో గానీ జనం కాదు. ఇలాంటి తప్పులకి జనం సరైన సమయంలో సరైన పద్ధతిలో కర్రు కాల్చి వాత పెడతారు. అదెలాగూ జరుగుతుంది. జనం మాటెలా వున్నా జగన్ పత్రిక సాక్షి చేస్తున్న పనికి పైన ఎక్కడో వున్న ఆయన తండ్రి వై.ఎస్ ఆత్మ కూడా క్షోభిస్తుంది. ఈ విషయం జనం అర్ధం చేసుకుంటే ఏపీ లో ఆ పత్రిక మీద అనధికారిక బ్యాన్ విధించడం ఖాయం.