నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రానా, జయ ప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్ తదితరులు
డైరెక్టర్: శ్రీవాస్
నిర్మాత: అబిషేక్ నామ
మ్యూజిక్ డైరెక్టర్ : హర్షవర్ధన్ రామేశ్వరన్
అల్లుడు శ్రీను సినిమాతో తెరంగ్రేటం చేసి ‘జయ జానకి నాయక’ సినిమాతో హిట్ కొట్టిన బెల్లకొండ సాయి శ్రీనివాస్ తానేంటో నిరూపించుకున్నాడు. బోయపాటి తో చేసిన ఈ సినిమాతో పక్కా కమర్షియల్ హీరోగా మారిన శ్రీనివాస్ శ్రీ వాస్ దర్సకత్వంలో ‘సాక్ష్యం’ అనే ఫాంటసీ థ్రిల్లర్‌లో నటించాడు. అయితే ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఆగినా కాస్త లేట్ గా షోలు మొదలయ్యాయి. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ లాంటి హిట్ లు కొట్టిన శ్రీవాస్ దర్సకత్వంలో సక్సెస్ ఫుల్ భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ సాక్ష్యం ఎంత మేరకు అనచనాలను అందుకుంది అనేది పూర్తి సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
అసలేంటీ సాక్ష్యం :
స్వస్తిక్ పురం అనే చారిత్రక గ్రామంలోని రాజుగారు(శరత్‌కుమార్) పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి. అదే ప్రాంతంలో ఉండే మునస్వామి అతని తమ్ముళ్లు అక్రమాలకు పాల్పడుతుంటారు. వారికి ఎదురు తిరిగిన రాజుగారిని, అతని కుటుంబాన్ని దారుణంగా చంపేస్తారు. అయితే రాజుగారికి పుట్టిన కొడుకుని రాజుగారి భార్య ఓ లేగ దూడకు కట్టి తప్పిస్తుంది. అలా చావు నుంచి తప్పించుకున్న పిల్లాడిని ఓ వ్యక్తి తీసుకెళ్లి కాశీలో వదిలేస్తాడు. అలా కాశీ చేరిన ఆ శిశువుని శివ ప్రకాశ్(జయప్రకాశ్) చెంతకు చేరుతాడు. పిల్లలు లేని శివ ప్రకాశ్ ఆ పిల్లాడికి విశ్వజ్ఞ( బెల్లంకొండ సాయి శ్రీనివాస్) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తాడు.
శివ ప్రకాష్‌కు విదేశాల్లో వ్యాపారాలు ఉండటంతో విశ్వా కూడా అక్కడే పెరిగి పెద్దవాడవుతాడు. విశ్వ రియాలిటీ వీడియో గేమ్స్ డిజైన్ చేస్తూ ఉంటాడు. అక్కకు తోడుగా ఉండేందుకు అమెరికా వచ్చిన సౌందర్య లహరి(పూజ హెగ్డే) ప్రవచనాలు చెపుతుండగా చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెకు ఓ సందర్భంలో సహాయం చేస్తాడు. కానీ అది అర్థం చేసుకోని సౌందర్య విశ్వపై కోపంతో ఇండియాకు వచ్చేస్తుంది. విశ్వ కూడా సౌందర్య కోసం ఇండియా వచ్చేస్తాడు. అలా ఇండియా వచ్చిన విశ్వ సౌందర్యాని ఎలా కలిశాడు, అసలు వాళ్ళు కలుసుకున్నారా ? అన్నదే మిగతా కథ.
సాక్ష్యం ఎలా ఉందంటే :
ఇప్పటివరకు మనం మనుషులు, పాములు, అలాగే కొన్ని జంతువులు పగ తీర్చుకుంటాయని విన్నాం. కానీ ఫర్ ది ఫస్ట్ టైం పంచభూతాలే ప్రతీకారం తీర్చుకుంటాయన్న డిఫరెంట్ (ఫాంటసీ) కాన్సెప్ట్ తో కథను రెడీ చేసుకున్న దర్శకుడు శ్రీవాస్ పక్కా కమర్షియల్ ఫార్మాట్లో సినిమాను తెరకెక్కించాడు. శ్రీనివాస్ జయ జానకీ నాయకతో వచ్చిన మాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌తో కథ నడిపే ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యాడు. ఫస్ట్ హాఫ్‌లో యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని బ్యాలెన్స్ చేసిన దర్శకుడు ద్వితీయార్థాన్ని పూర్తిగా యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో నడిపించాడు. అయతే కొన్ని సీన్లు మాత్రం వాస్తవికతకి దూరంగా ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు లియలిస్టిక్ గా అనిపించదు. అయితే సినిమాకి హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. పాటలు వినడానికి, చూడటానికి బాగున్నా కథనం మధ్యలో తలనొప్పిగా మారి ఇబ్బంది పెడతాయి. సినిమాటోగ్రఫి అయితే చాలా బాగుంది. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నటన విషయంలోకి వస్తే సినిమా సినిమాకి నటనలో శ్రీనివాస్ మెరుగు పడుతున్నాడు. పూజా మామూలుగానే ఈజ్ తో నటించింది. అయితే కొన్ని చోట్ల డబ్బింగ్ విషయంలోనే కాస్త శ్రద్ద ఎక్కువ పెట్టాల్సింది. జగపతి బాబు మరో సారి తన మరక్ విలనిజం చూపించాడు. మిగతా నటీనటులు తమతమ పరిధిమేరకు బాగానే నటించారు.
తెలుగు బులెట్ పంచ్ లైన్ : సాక్ష్యం… పంచభూతాల సాక్షిగా శత్రు మరణం.
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.5 / 5