సాక్ష్యం కి టిక్కెట్లు ఇచ్చారు గానీ బొమ్మ పడలేదు

sakshyam-movie-premiers-and

టీం టీం అంతా కలిసి ఏడుకొండలవాడిని మొక్కినా సాక్ష్యం సినిమాకి ఇబ్బందులు తప్పడం లేదు. ఇంతకుముందు సినిమాలో జంతువులకు సంబంధించిన షాట్స్ విషయంలో అనుమతులకు కొన్ని అవాంతరాలు వచ్చాయని , అందుకే సెన్సార్ లో బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి. ఈ విషయంలో మహారాష్ట్ర గవర్నర్ కలగజేసుకుంటున్నారని స్వయంగా చిత్ర యూనిట్ కి సంబంధించిన వాళ్ళే చెప్పారు. ఆ సమస్య తీరింది ఈ రోజు రిలీజ్ అని భారీగా ప్రచారం చేశారు. టికెట్స్ కూడా ఇచ్చారు.

ప్రకృతికి , పంచభూతాలకు ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యం ఉంటుందని జరిగిన ప్రచారంతో దీని మీద సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. అందుకే తొలి ఆట చూద్దామని చాలా మంది ఉత్సాహపడ్డారు. కానీ జరిగింది వేరు. తీరా థియేటర్స్ వెళ్లేసరికి సాక్ష్యం స్క్రీనింగ్ ఆగిపోయినట్టు తెలిసింది. ఇక ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నవాళ్ళు గేట్ దాకా హుషారుగా నిరుత్సాహంతో వెనక్కి మళ్ళారు.

సాక్ష్యం స్క్రీనింగ్ ఆగడానికి అసలు కారణం ఏంటో అధికారికంగా బయటకు రాలేదు. అయితే నిర్మాతలతో డిజిటల్ ప్రొజెక్షన్ సిస్టం క్యూబ్ తో ఇబ్బందులు వచ్చాయని కొందరు , నిర్మాతలతో ఫైనాన్సియర్స్ మధ్య వివాదాలతో స్క్రీనింగ్ ఆగిందని ఇంకొందరు చెబుతున్నారు.