కన్నడంలో 2016లో తెరకెక్కి విడుదలైన ‘యూటర్న్’ చిత్రంను అప్పటి నుండి కూడా సమంత చేయాలని ఉవ్విల్లూరుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆ చిత్రాన్ని ఈ సంవత్సరం చేయగలిగింది. జర్నలిస్ట్ పాత్రలో ఈ రీమేక్‌లో సమంత కనిపించబోతుంది. ఈ చిత్రం కోసం పారితోషికం కాకుండా షేర్‌ను తీసుకుంటుంది అంటే సినిమాపై ఆమెకు ఎంత నమ్మకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పారితోషికం విషయంలో డిమాండ్ చేయకుండా, సినిమా బడ్జెట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలను ఒప్పించగలిగింది. ఈ అమ్మడు తాజాగా ‘యూటర్న్’ రీమేక్‌ను పూర్తి చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యూటర్న్ సమంత ఆగస్టులో తీసుకునేందుకు సిద్దం అయ్యింది.
తాజాగా షూటింగ్‌కు గుమ్మడి కాయ కొట్టేయడం జరిగిందని, ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. వచ్చే వారంలో తన పాత్రకు సమంత డబ్బింగ్ చెప్పుకోబోతుంది. ఆమె పూర్తి చేసిన తర్వాత ఇతర నటీనటులు డబ్బింగ్ పూర్తి చేయబోతున్నారు. మరో వైపు చిత్రంకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. జులై 20 వరకు సినిమా ఫస్ట్ కాపీని సిద్దం చేయాలని భావిస్తున్నారు. సినిమా కోసం భారీ ఎత్తున పబ్లిసిటీ చేయాలని సమంత ప్లాన్ చేస్తుంది. సొంతంగా, ఇష్టంగా చేసిన సినిమా అవ్వడం వల్ల ఈ సినిమా ప్రమోషన్‌కు నాగచైతన్యను తీసుకు వచ్చే విషయమై సమంత ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్న చిత్ర యూనిట్ సభ్యులు సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో ఆది పినిశెట్టి మరియు రాహుల్ రవీంద్రన్‌లు కనిపించబోతున్నారు.