Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్టార్ హీరోయిన్గా వరుస చిత్రాలు చేస్తున్న సమయంలో ఎవరైనా కూడా సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు ఆసక్తిని కనబర్చరు. కాని సమంత మాత్రం తానో స్టార్ హీరోయిన్ అయినప్పటికి ‘మహానటి’ చిత్రంలో ఒక సాదారణ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాలున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్బంగా సమంత మాట్లాడుతూ ఒక్క సీన్ తాను ఈ సినిమాను చేసేందుకు ప్రేరేపించింది అంటూ చెప్పుకొచ్చి అందరిలో ఆసక్తిని కలిగింది.
ఒక స్టార్ హీరోయిన్ను క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు ఒప్పించిన ఆ సీన్ ఏంటా అని ప్రస్తుతం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తునన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు అంచనాు వేస్తున్నారు, ఊహించుకుంటున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఆ విషయాన్ని పక్కా రహస్యంగా ఉంచుతున్నారు. ఎక్కువ మంది ఊహించుకుంటున్న విషయం ఏంటీ అంటే సావిత్రి చనిపోయిన సమయంలో జనాలు ఆమె గురించి తప్పుగా మాట్లాడుకుంటున్న సమయంలో జర్నలిస్ట్‌గా ఆమె సావిత్రి గొప్పదనంను తెలియజేసే సీన్. ఈ సీన్లో సమంత అద్బుతంగా నటించి ఉంటుందని, తన సొంత డబ్బింగ్‌తో ఆ సీన్‌కు ప్రాణం పోషి ఉంటుందని సోషల్ మీడియాలో కొందరు కథను అల్లేసుకుంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది మాత్రం సినిమా విడుదల అయితే కాని తెలియదు. వచ్చే వారంలో విడుదల కాబోతున్న మహానటి చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకే సారి విడుదల చేయబోతున్నారు.
