సౌత్ సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ మేకర్స్ ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుస్తూ సినిమాలు తీస్తున్నారు. ఒక్కప్పుడు నార్త్ కే పరిమితమైన మల్టీ స్టారర్ సినిమాలు ఇప్పుడు సౌత్లో హావా సాగిస్తున్నాయి. సినిమా సీక్వెల్ విషయంలో కూడా సౌత్ తన సత్తా ఏమిటో చూపిస్తుంది. తెలుగు లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చినా ఆర్య చిత్రం బన్నీ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనికి సీక్వెల్ గా ఆర్య 2 రావడం మంచి విజయం ను సొంతం చేసుకోవడం జరిగింది. రాంగోపాల్ వర్మ తీసినా రక్త చరిత్ర 1, దానికి సీక్వెల్ రక్త చరిత్ర 2 బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయంను తెచ్చి పెట్టాయి. గ్రేట్ తమిళ్ డైరెక్టర్ శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చినా రోబో చిత్రం తెలుగు తమిళంలో మంచి విజయం ను సొంతం చేసుకుంది. దానికి సీక్వెల్ గా 2.ఓ చిత్రం విడుదలకు సిద్ధం గా ఉన్నది.
ఇక సెల్వ రాఘవన్ దర్శకత్వం లో హీరో కార్తి నటించిన చిత్రం యుగానికి ఒక్కడు. ఆ చిత్రం తెలుగు తమిళంలో మంచి విజయాన్ని దక్కించుకుంది. యుగానికి ఒక్కడు చిత్రం ముఖ్యంగా చోళ రాజులు నేపధ్యం కాలంలో సాగే కథ గా తెరకెక్కించాడు. ఈ చిత్రం చూసినా ప్రతి ప్రేక్షకుడి మనసులో ఓ ఆలోచన ఉంటుంది, అదే ఈ చిత్రం సీక్వెల్ ఎప్పుడు అని, సెలవ్వ కూడా ఈ చిత్రానికి సీక్వెల్ చేయలి అని మనసులో ఉన్నది అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఇప్పుడు కార్తీక్ కు తమిళం, తెలుగు లో మంచి డిమాండ్ ఉన్నది కావునా ఇదే సారైనా సమయం అని సెల్వ రాఘవన్ భావిస్తున్నాడు. త్వరలో ఆ చిత్రానికి కూడా సీక్వెల్ రానున్నది అన్నమాట.